ఆ ఇద్దరు లెజెండ్స్ అంటే ధనుష్ కి ఇష్టం అట.. బయోపిక్ కి రెడీ

By team telugu  |  First Published Dec 27, 2021, 9:50 AM IST

విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న నటుడు ధనుష్. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడైనప్పటికీ మాస్ ఇమేజ్ చక్రంలో చిక్కుకోకుండా ప్రయోగాలతో అలరిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ధనుష్ కర్ణన్, అసురన్ లాంటి గొప్ప చిత్రాల్లో నటించాడు.


విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న నటుడు ధనుష్. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడైనప్పటికీ మాస్ ఇమేజ్ చక్రంలో చిక్కుకోకుండా ప్రయోగాలతో అలరిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ధనుష్ కర్ణన్, అసురన్ లాంటి గొప్ప చిత్రాల్లో నటించాడు. ఈ చిత్రాల్లో ధనుష్ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. 

తన వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా వైవిధ్యమైన రోల్స్ ఎంచుకుంటున్నాడు ధనుష్. దీనితో ధనుష్ ఎలాంటి పాత్రలో అయినా ఇమిడిపోగలడనే ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇండియన్ సినిమాలలో బయోపిక్ చిత్రాల ట్రెండ్ సాగుతోంది. ప్రముఖుల జీవిత చరిత్రలని వెండితెరపై ఆవిష్కరించేందుకు దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. 

Latest Videos

ఎన్టీఆర్, జయలలిత, సావిత్రి లాంటి ప్రముఖులపై ఇప్పటికే బయోపిక్ చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న యువ నటీనటులు బయోపిక్ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ధనుష్ కూడా బయోపిక్ చిత్రాలపై తన మనసులో మాట బయటపెట్టాడు. అక్షయ్‌ కుమార్, ధనుష్, సారా అలీఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆత్రంగి రే’. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 24 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. 

ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ధనుష్ బయోపిక్ చిత్రాలపై స్పందించాడు. తాను ఎవరి బయోపిక్స్ లో నటించాలని అనుకుంటున్నాడో తెలిపాడు. సూపర్ స్టార్  రజనీకాంత్, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా తనకు ఇష్టమైన వ్యక్తులు అని ధనుష్ తెలిపాడు. అవకాశం ఉంటే వారిద్దరి బయోపిక్ చిత్రాల్లో నటిస్తానని ధనుష్ తెలపడం విశేషం. 

సో ఇక దర్శక నిర్మాతలు రజనీ, ఇళయరాజా బియోపిక్స్ కోసం ధనుష్ ని అప్రోచ్ అయిపోవచ్చు. ఇదిలా ఉండగా ధనుష్ తన కెరీర్ లో తొలిసారి స్ట్రైట్ తెలుగు చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి 'సార్' అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. 

Also Read: Samantha-Naga Chaitanya: విడాకుల తర్వాత ఒకే చోటకు సమంత-నాగ చైతన్య.. ఇక ఏం జరిగిదంటే!

click me!