పవన్ 'ఓజి' గ్లింప్స్ పై రాంగోపాల్ వర్మ కామెంట్స్.. అవుట్ ఆఫ్ ది వరల్డ్, ఇదే బెస్ట్ అంటున్న ఆర్జీవీ

Published : Sep 02, 2023, 05:33 PM IST
పవన్ 'ఓజి' గ్లింప్స్ పై రాంగోపాల్ వర్మ కామెంట్స్.. అవుట్ ఆఫ్ ది వరల్డ్, ఇదే బెస్ట్ అంటున్న ఆర్జీవీ

సారాంశం

పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఓజి చిత్ర యూనిట్ గ్లింప్స్ ని విడుదల చేసింది. గ్లింప్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉంటూ అదిరిపోయింది. ఓజి గ్లింప్స్ పై తాజాగా వర్మ కామెంట్స్ చేసారు. 

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి అందరికి తెలిసిందే. రాంగోపాల్ వర్మకి ఏ విషయంలోనూ ఎమోషన్స్ ఉండవు. ప్రతి విషయాన్ని వర్మ లైట్ తీసుకుంటూ లైఫ్ ని బిందాస్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో వర్మ ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా వాటిని సమర్థించుకునే నైపుణ్యం కూడా వర్మ దగ్గర ఉంది. 

ఎప్పుడూ పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. పీకే ఫ్యాన్స్ తో గిల్లికజ్జాలు పెట్టుకునే వర్మ తాజాగా మరోసారి తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు. నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఓజి చిత్ర యూనిట్ గ్లింప్స్ ని విడుదల చేసింది. గ్లింప్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉంటూ అదిరిపోయింది. డైరెక్టర్ సుజీత్ అందించిన గూస్ బంప్స్ స్టఫ్ తో ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 

ఓజి గ్లింప్స్ పై తాజాగా వర్మ కామెంట్స్ చేసారు. ఈసారి వర్మ పాజిటివ్ గా రెస్పాన్స్ ఇవ్వడం విశేషం. వర్మ ట్వీట్ చేస్తూ.. ఇది పవన్ కళ్యాణ్ కి హ్యాపీయెస్ట్ బర్త్ డే. ఓజి గ్లింప్స్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ అనిపించే విధంగా ఉంది. నేను చూసిన పవన్ కళ్యాణ్ సినిమా ట్రైలర్స్ లో ఇదే బెస్ట్. హే సుజీత్ నువ్వు చంపేశావ్ అంటూ వర్మ ప్రశంసలు కురిపించాడు. 

అర్జున్ దాస్ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో గ్లింప్స్ అదిరిపోయింది. పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా.. అది మట్టి, చెట్లతో పాటు సగం ఊరిని ఊడ్చేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాన్ కడగలేకపోయింది. అది ఫ్రీకింగ్ బ్లడ్ బాత్. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అంటూ అర్జున్ దాస్ పవన్ కి ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు. 

దీనికి తోడు పవన్ రక్తపాతం సృష్టిస్తూ కత్తిని చేతబట్టి చిన్న సైజు యుద్ధమే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ స్వాగ్, స్టైల్ ఫ్యాన్స్ ని కట్టిపడేసే విధంగా ఉన్నాయి. సుజీత్ టేకింగ్ మరో కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లు ఉంది. తమన్ ఇస్తున్న బిజియం కూడా అదుర్స్ అనే చెప్పాలి. ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఓజి టీజర్ ఉంది. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి