పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు.. చిరు ప్రత్యేకమైన నోట్.. టాలీవుడ్ స్టార్స్ నుంచి శుభాకాంక్షల వెల్లువ

Published : Sep 02, 2023, 05:26 PM ISTUpdated : Sep 02, 2023, 06:15 PM IST
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు.. చిరు ప్రత్యేకమైన నోట్.. టాలీవుడ్ స్టార్స్ నుంచి శుభాకాంక్షల వెల్లువ

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం నుంచి సినీ తారల నుంచి శుభాకాంక్షలు అందుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా సెలబ్రెటీలు విషెస్ తెలుపుతూనే ఆయనపై ఉన్న అభిమాన్ని వ్యక్తం చేశారు.   

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  పుట్టిన రోజు సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు పండగలా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే బర్త్ డే ట్రీట్ గా ‘హరిహర వీరమల్లు’ నుంచి సరికొత్త పోస్టర్, OG నుంచి టీజర్ విడుదలై దుమ్ములేపుతున్నాయి. ఆ అప్డేట్స్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు టాలీవుడ్ తారలు కూడా పవన్ కళ్యాణ్ కు ఉదయం నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా మొత్తం పవర్ స్టార్ బర్త్ డే ట్వీట్లతోనే నిండిపోయింది. 

అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ప్రేమగా ట్వీట్ చేశారు. ’జనహితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే  నీ ప్రయాణంలో, నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ.. నీకు జన్మదిన శుభాకాంక్షలు!’ అంటూ ట్వీట్ చేశారు. చిరు విష్ చేసిన తీరుకు పవన్ అభిమానులు మరింత ఖుషీ అవుతున్నారు. 

తమ్ముడు పవన్ కు అన్ననాగబాబు కొణిదెల కూడా ఎమోషనల్ నోట్ రాస్తూ బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను కూడా షేర్ చేశారు. జనసేనాని వెంటనే ఉంటున్న నాగబాబు పవన్ కళ్యాణ్ కు ఎప్పుడూ మద్దతుగా ఉంటారనే విషయం తెలిసిందే. 

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)  ఉదయమే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ కు ఎప్పుడు లేనటువంటి సక్సెస్, ఆనందం తేవాలని ఆకాంక్షించారు. 
 

మాస్ మహారాజా రవితేజ పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరింత ఆరోగ్యం, సక్సెస్ అందాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ లో పేర్కొన్నారు. 

అలాగే, సాయి ధరమ్ తేజ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నితిన్, లావణ్య త్రిపాఠి, టాలీవుడ్ దర్శకులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. 

 

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

BBK 12 Finale: బిగ్ బాస్ ప్రకటించకముందే విన్నర్ పేరు లీక్ చేసిన వికీపీడియా.. విజేత ఎవరో తెలుసా?
'సినిమాలు వదిలేద్దామనుకున్నా.. చిరంజీవి నన్ను పిలిచి ఇలా అన్నాడు'