నాని 'దేవదాస్'పై సోషల్ మీడియాలో రచ్చ!

Published : Sep 21, 2018, 06:20 PM IST
నాని 'దేవదాస్'పై సోషల్ మీడియాలో రచ్చ!

సారాంశం

నాగార్జున-నాని కలిసి నటించిన 'దేవదాస్' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుండి కూడా ఇది ఓ హాలీవుడ్ సినిమాకు రీమేక్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి

నాగార్జున-నాని కలిసి నటించిన 'దేవదాస్' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుండి కూడా ఇది ఓ హాలీవుడ్ సినిమాకు రీమేక్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

దీనిపై స్పందించిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ కథ ఏ సినిమాకు రీమేక్ కాదని స్పష్టం చేశాడు. ఒరిజినల్ స్క్రిప్ట్ తో సినిమా తీస్తున్నామని అన్నారు. అయితే తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్ ని బట్టి 'దేవదాస్' కథ హాలీవుడ్ సినిమా 'అనలైజ్ దిస్'కి దగ్గరగా ఉందని సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి.

ఆ సినిమాలో రెండు పాత్రలను స్పూర్తిగా తీసుకునే దర్శకుడు ఈ దేవదాస్ సినిమా చేశాడంటూ ఆరోపణలు చేస్తున్నారు. 'అనలైజ్ దిస్' సినిమాలో రాబర్ట్ డెనిరో పోషించిన పాత్ర దేవదాస్ లోని నాగార్జున పాత్రకి పోలుకలున్నాయని, అలానే నాని పాత్ర బిల్లీ క్రిస్టల్ పాత్రని పోలి ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ రెండు సినిమాల వీడియోలను పక్క పక్కన పెట్టి మరీ పోలికల గురించి చర్చిస్తున్నారు. మరి ఈ విషయంపై దర్శకుడు ఎలా స్పందిస్తాడో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Naga Vamsi: సంక్రాంతి సినిమాల పోటీపై నిర్మాత నాగవంశీ హాట్‌ కామెంట్‌.. `అనగనగా ఒక రాజు` ఎందుకు స్పెషల్‌ అంటే
The Raja Saab రిజల్ట్ ని ప్రభాస్‌ని ముందే ఊహించాడా? మారుతితో ఏం చెప్పాడంటే.. ది రాజా సాబ్‌ 2 అప్‌డేట్‌