వర్మ అంటే వోడ్కా.. నిజమే రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళా, నెక్స్ట్ మూవీతో నేనేంటో చూపిస్తా

Published : Nov 10, 2025, 11:48 PM IST
Ram Gopal Varma

సారాంశం

రాంగోపాల్ వర్మ, నాగార్జున కాంబోలో వచ్చిన శివ మూవీ నవంబర్ 14న రీ రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో తన తదుపరి చిత్రంతో తానేంటో చూపిస్తానని వర్మ అన్నారు. 

శివ మూవీ రీ రిలీజ్ 

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సృష్టించిన అద్భుతం శివ మూవీ నవంబర్ 14న గ్రాండ్ రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఒక రేంజ్ లో నాగార్జున, వర్మ రీ రిలీజ్ కి ప్రమోషన్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు లాంటి వాళ్లంతా శివ రీ రిలీజ్ కి మద్దతు తెలిపారు. నాగార్జున సతీమణి అమల బిగ్ బాస్ వేదికపైకి వచ్చి శివ మూవీ కోసం ప్రమోషన్స్ చేయడం జరిగింది. 

శివ మూవీలో నాగార్జున, అమల జంటగా నటించగా.. రఘువరన్ విలన్ పాత్రలో నటించారు. జేడీ చక్రవర్తి, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటించారు. శివ మూవీ 1989లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీని వర్మ తెరకెక్కించిన విధానం ఇండియన్ సినిమా ఫిలిం మేకర్స్ కి ఒక పాఠం అనే చెప్పాలి. వర్మ తెరకెక్కించిన విధానం ఆయన మేధస్సుకి నిదర్శనంలా నిలిచాయి. 

నెక్స్ట్ మూవీతో నేనేంటో చూపిస్తా 

నాగార్జున సైకిల్ చైన్ తో సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఈ రీరిలీజ్ ప్రెస్ మీట్ లో వర్మ, నాగార్జున పాల్గొన్నారు. శివ లాంటి తెలుగు సినిమా గేమ్ ఛేంజింగ్ మూవీ తెరకెక్కించిన వర్మ ఆ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన సందర్భాలు చాలా తక్కువ. ఇటీవల అయితే అనే పూర్తిగా రాంగ్ ట్రాక్ లోకి వెళ్లిపోయారు. వివాదాలతో సహవాసం చేస్తున్నారు. 

ఇదే విషయం గురించి ఏసియా నెట్ న్యూస్ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు వర్మ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. శివ మూవీ చూస్తే వర్మలో ఎంత ట్యాలెంట్ ఉంది అనే విషయం తెలుస్తుంది.. కానీ ఇప్పుడు మీ ట్యాలెంట్ రాంగ్ ట్రాక్ లోకి వెళుతోంది అని అనిపిస్తోంది, వర్మ అంటే వోడ్కా అంటూ సెటైర్లు వేసుకునే పరిస్థితి వచ్చింది.. మీరు రియలైజ్ అయ్యారా అని ప్రశ్నించారు. అది నిజమే.. పూర్తిగా రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయా. కానీ నా నెక్స్ట్ సినిమాలో నేనెంటో చూపిస్తా అంటూ వర్మ స్పందించారు. మరి వర్మ తాను చెప్పినట్లు తదుపరి చిత్రంతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాలి. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

First Finalist: బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఫస్ట్ ఫైనలిస్ట్ కన్ఫమ్‌.. తనూజ చేసిన మోసానికి రీతూ బలి
Mirchi Madhavi: ఐదుగురితో కాంప్రమైజ్ అయితే ప్రకాష్ రాజ్ భార్యగా ఛాన్స్, నీ సంగతి తెలుసులే అన్నారు