విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌లకు మగబిడ్డ.. తల్లిదండ్రులైన జంట

Published : Nov 07, 2025, 01:57 PM IST
Vicky Kaushal and Katrina Kaif

సారాంశం

Vicky Kaushal and Katrina Kaif Welcome a Baby Boy : విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ తల్లిదండ్రులయ్యారు. వారికి మగబిడ్డ పుట్టాడు. ఈ జంట నవంబర్ 7, 2025న ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వార్తను ప్రకటించింది. 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్  కత్రినా కైఫ్ శుక్రవారం రోజున తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చింది.స్టార్ జంట విక్కీ కౌశల్, కత్రినా కైఫ్  తల్లీతండ్రులయ్యారు. వారికి  పండంటి మగబిడ్డ పుట్టాడు.

విక్కీ, కత్రినా ఇద్దరూ కలిసి తమ కొడుకు పుట్టిన విషయాన్ని ప్రకటించి, అభిమానులను, స్నేహితులను ఆనందంలో ముంచెత్తారు. "మా ఆనందాల మూట వచ్చేసింది. ఎంతో ప్రేమ, కృతజ్ఞతతో మా అబ్బాయికి స్వాగతం పలుకుతున్నాం. నవంబర్ 7, 2025. కత్రినా & విక్కీ," అని సోషల్ మీడియా నోట్‌లో రాశారు.

ఇక ఈ వార్తను వారు షేర్ చేసిన వెంటనే అందరు శుభాకాంక్షలు తెలపడం మొదలు పెట్టారు.  వెంటనే, మనీష్ మల్హోత్రా, ఉపాసన కామినేని కొణిదెల, నేహా ధూపియా, హుమా ఖురేషి, రకుల్ ప్రీత్ సింగ్, లారా భూపతి, అర్జున్ కపూర్, గునీత్ మోంగా, శ్రేయా ఘోషల్ లాంటి చాలామంది కామెంట్స్ సెక్షన్‌లో అభినందన సందేశాలు పంపారు.

 

 

ప్రెగ్నెన్సీ ప్రకటించింది ఎప్పుడు? 

చాలా రోజులుగా కత్రీనా గర్భవతి అని వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఈ విషయంలో స్టార్ జంట కాస్త లేటుగా స్పందించాడు.  గత సెప్టెంబర్‌లో, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ తాము తల్లీ తండ్రులు కాబోతున్నట్టు  ఒక అందమైన మెటర్నిటీ ఫోటోషూట్ చిత్రంతో ధృవీకరించారు. "మా జీవితాల్లోని ఉత్తమ అధ్యాయాన్ని ఆనందం, కృతజ్ఞతతో నిండిన హృదయాలతో ప్రారంభించబోతున్నాం," అని వారు ఇన్‌స్టాగ్రామ్‌లో కలిసి ప్రకటించారు.

విక్కీ, కత్రినాల ప్రేమకథ

విక్కీ, కత్రినా డిసెంబర్ 9, 2021న రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో పెళ్లి చేసుకున్నారు. ఇక 'కాఫీ విత్ కరణ్' షోలో, కత్రినా తమ ప్రేమ కథ గురించి వివరించింది.  తాను విక్కీని జోయా అక్తర్ పార్టీలో కలిశానని, అప్పుడే  ప్రేమ మొదలైందని చెప్పింది. విక్కీతో తన సంబంధం గురించి వివరిస్తూ,  ‘’విక్కీ అసలు తన 'రాడార్'లోనే లేడు , ముందు నుంచి విక్కీ పెద్దగా పరిచయం లేడు, అతని గురించి వినడమే తప్ప.. డైరెక్టర్ గా కలిసింది లేదు. కానీ ఫస్ట్ టైమ్ విక్కీని కలిసినప్పుడు మాత్రం నేను ఫిదా అయ్యాను, అప్పుడే మా మధ్య ప్రేమ చిగురించింది''  అని కత్రీనా కైఫ్ తమ ప్రేమ గురించి వివరించింది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

The Raja Saab 6 Days Collection: ది రాజాసాబ్‌కి ఆరో రోజు పెరిగిన కలెక్షన్లు.. ప్రభాస్‌ టార్గెట్‌కి ఎంత దూరంలో ఉన్నాడంటే
BMW vs Anaganaga Oka Raju: రవితేజకి నవీన్‌ పొలిశెట్టి బిగ్‌ షాక్‌.. `అనగనగా ఒక రాజు`కి ఊహించని కలెక్షన్లు