'మహానాయకుడు' పోస్టర్.. వర్మ, రానాల కామెంట్లు!

By Udaya DFirst Published 21, Feb 2019, 2:55 PM IST
Highlights

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క ఈ సినిమాకి పోటీగా వర్మ తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

మార్చి మొదటి వారంలో సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 'మహానాయకుడు' సినిమా కంటే వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపైనే జనాలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

ఇది ఇలా ఉండగా.. ట్విట్టర్ లో వర్మ.. చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపిస్తున్న రానాని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశాడు. రానా క్యారెక్టర్ ఫోటోని పోస్ట్ చేసిన వర్మ.. ''చంపేశావ్ రానా.. నిజానికి మించి నీ రూపు కనిపిస్తోంది'' అంటూ పోస్ట్ పెట్టగా.. అది చూసిన రానా.. 'థాంక్యూ' అంటూ బదులిచ్చాడు. 

Hey ⁦⁩ ..U are KILLING IT ..U are looking more original than original🙏🙏🙏 pic.twitter.com/lyXrWQsNpC

— Ram Gopal Varma (@RGVzoomin)
Last Updated 21, Feb 2019, 2:55 PM IST