రష్మికనే పెళ్లాడతాడట.. ఆమె ఏమంటుందంటే..?

By Udaya DFirst Published 21, Feb 2019, 2:41 PM IST
Highlights

నాలుగేళ్ల పిల్లాడు పెళ్లి చేసుకుంటే అది రష్మికనే అంటూ భీష్మించుకొని కూర్చున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ పెళ్లి ప్రపోజల్ రష్మిక వరకూ చేరింది. 

నాలుగేళ్ల పిల్లాడు పెళ్లి చేసుకుంటే అది రష్మికనే అంటూ భీష్మించుకొని కూర్చున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ పెళ్లి ప్రపోజల్ రష్మిక వరకూ చేరింది. అంతేకాదు.. ఆమె సిగ్గుపడుతూ స్పందించింది కూడా.

ప్రతీక్ ఎవరిని పెళ్లి చేసుకుంటావని ఆ చిన్నారిని ప్రశ్నిస్తే రష్మిక అని సమాధానమిచ్చాడు.. రష్మిక ఎవరని అడిగితే.. ఇంకేం ఇంకేం కావాలే అంటూ ఆమె పాటని గుర్తు చేశాడు. నీకంటే పెద్దది కదా అని అడిగితే.. అయినా చేసుకుంటా అంటూ బదులిచ్చాడు.

ఈ ఫన్నీ వీడియో రష్మిక చూసి ట్విట్టర్ వేదికంగా స్పందించింది. ''నన్ను పెళ్లి చేసుకుంటావా..? అయ్యో నాకు సిగ్గు బాబు.. కానీ చాలా క్యూట్ ఆ ఉన్నావ్.. నా ప్రేమ నీకు ఎప్పటికీ ఉంటుంది'' అంటూ సిగ్గుతో కూడిన ఎమోజీలను షేర్ చేసింది. మొత్తానికి ఈ బుడతడి ప్రేమ రష్మికకి చేరడం, దానికి ఆమె అంగీకరించడం నెటిజన్లను ఆకర్షిస్తోంది. 

Awww🙈nannu pelli cheskuntava? 🙈♥️ aiyooo naku full shy happening..🙊🙈 so cute! too much love to you little man.. mwahs♥️ xoxo https://t.co/3v8tVQ6pHm

— Rashmika Mandanna (@iamRashmika)
Last Updated 21, Feb 2019, 2:41 PM IST