సెన్సేషన్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తన నెక్ట్స్ మూవీని ప్రకటించారు. ఓ క్రేజీ టైటిల్‌తో ఆయన మళ్లీ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఇదిప్పుడు క్రేజీగా మారింది.
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. ఇటీవల `వ్యూహం` సినిమాతో వచ్చాడు. వైఎస్ జగన్ జీవితంపై ఈ మూవీని రూపొందించారు. రెండు భాగాలుగా దీన్ని తెరకెక్కించగా, ఇటీవల విడుదలయ్యాయి. కానీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. వైసీపీ ఎజెండా చిత్రాలుగా విమర్శలను ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సినిమాని ప్రకటించారు వర్మ.
Survey:వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. `నా పెళ్లాం దెయ్యం` అనే పేరుతో సినిమాని ప్రకటించారు. ఈ మేరకు ఆయన పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో మంగళసూత్రం ఓ టేబుల్‌పై పెట్టి ఉంది. లోపల కిచెన్‌లో వంట చేస్తూ కనిపిస్తుంది. కాకపోతే దాన్ని బ్లర్ చేశారు. ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.
వర్మ ఇందులో ఏం చెప్పబోతున్నాడనేది, భార్యని ఎలా చూపించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఆర్జీవీ సినిమాలు పోస్టర్లు మాత్రమే క్రేజీగా ఉంటాయి. బోల్డ్ గా ఉంటాయి. వాటితోనే హడావుడి చేస్తుంటాడు వర్మ. కానీ సినిమాలో విషయం ఉండదు. బోరింగ్ గా మారతాయి. దీంతో ఆయన సినిమాలను ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్‌గా ఉన్న ఆయన్ని ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు.
దీంతో ఆయన తీసే సినిమాలను కూడా డీ గ్రేడ్ మూవీగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ప్రకటించిన `నా పెళ్లాం దెయ్యం` కూడా అలానే ఉంటుందా? ఇందులో అయినా విషయం ఉంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక దీనికి సంబంధించిన పూర్తివివరాలు ప్రకటించాల్సి ఉంది. అయితే అందుకు ముందే `శారీ` పేరుతో ఓ అమ్మాయి ఫోటోని పంచుకున్నాడు వర్మ. అది ఇదేనా, లేక అది వేరు ఇది వేరా? అనేది తెలియాల్సి ఉంది.