మళ్లీ తెరపైకి ఇస్మార్ట్‌ శంకర్‌ కాంబినేషన్‌..? రామ్ తో ఇస్మార్ట్ కా బాప్ తీస్తానంటున్న పూరీ

Published : Apr 21, 2023, 09:22 PM IST
మళ్లీ తెరపైకి ఇస్మార్ట్‌ శంకర్‌ కాంబినేషన్‌..? రామ్ తో  ఇస్మార్ట్ కా బాప్ తీస్తానంటున్న పూరీ

సారాంశం

మరోసారి ఊర మాస్ కాంబినేషన్ కలవబోతోంది. చాలా కాలం తరువాత పూరీ జగన్నాథ్ కు డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్ అందించిన ఇస్మార్ శంకర్ కాంబో రిపీట్ కాబోతుందట. రామ్ పోతీనేనితో పూరీ సినిమా చేయబోతున్నాడనిసమాచారం. 

ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల ఇమేజ్ ను తన సినిమాలతో అమాంతం పెంచాడు దర్శకుడు పూరీ జన్నాథ్.  రామ్ లాంటి లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరోను.. ఇస్మార్ట్ శంకర్ తో మాస్ మసాలా హీరోగా మార్చి.. చాలా కాలంగా ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న పూరీ.. ఇండస్ట్రీలో మంచి హిట్ కొట్టి తన ఉనికిని కాపాడుకున్నాడు. కాని ఆతరువాత మళ్లీ పెద్ద దెబ్బ తగిలింది పూరీ జగన్నాథ్ కు . లైగర్ తో భారీ డిజాస్టర్ ను పేస్ చేశాడు. 

విజయ్ దేవరకొండతో పాన్ ఇండియ  సినిమాగా లైగర్‌ను తెరకెక్కించిన పూరీ.. ఈసినిమాకు భాగా కష్టపడ్డాడు. కాని ఏం లాభం లేకపోయింది. సినిమా హిట్ అవ్వకపోగా.. లైగర్ పై భారీ ఎత్తున ఎత్తున ట్రోల్స్‌ కూడా వచ్చాయి. లైగర్ ఎఫెక్ట్‌తో చాలా కాలంగా సైలెంట్ అయిపోయాడు పూరీ. ఎక్కువగా బయటకు కూడా రాలేకపోతున్నాడు. ఇక ఆయన నెక్ట్స్‌ చేయబోయే సినిమా ఏంటనే దానిపై  పూరీ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్‌ సినిమాకు సబంధంచి ఓ వార్త సోషల్ మీడియలో హల్ చల్ చేస్తోంది. ఆయన  మరోసారి రామ్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. 

పూరీ జగన్నాథ్‌, ఛార్మీ బ్యానర్‌ పూరీ కనెక్ట్స్‌ పై రామ్‌ హీరోగా మరో సినిమా రాబోతుందని తాజా టాక్‌. దీనిపై అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. కాని ఈస్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అటు రామ్ ఫ్యాన్స్ ఫుల్గ్ గా ఎంజాయ్ చేస్తున్నారు. రామ్‌-పూరీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రం ఏ జోనర్‌లో ఉండబోతుంది.. మళ్లీ బాక్సాఫీస్‌ వద్ద ఏ రేంజ్‌లో రికార్డులు సృష్టించబోతుందోనని అప్పుడే అంచనాలు వేసుకుంటున్నారు మూవీ లవర్స్‌. 

ఇక మాస్ ఇమేజ్ కోసం పాకులాడుతున్న రామ్... ఇస్మార్ట్ శంకర్ తరువాత చేసిన సినిమాలన్నీ ధారుణంగా ఫెయిల్ అయ్యాయి. దాంతో మాస్ సినిమాల రారాజు  బోయపాటి శ్రీను దర్శకత్వంలో RAPO20 సినిమా చేస్తున్నాడు రామ్‌. ఈ భారీ  యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాది దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ఈసినిమా షూటింగ్ పూర్తయిన తరువాత.. రామ్ తో పూరీ సినిమా స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు సోషల్ మీడియా జనాలు. మరి ఇది నిజమా.. అనౌన్స్ మెంట్ ఎప్పుడు ఇస్తారు అనేది చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు
Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్