
రామ్ చరణ్, ఉపాసన దాదాపు పెళ్లైన పదేళ్ళ తరువాత తమ మొదటి బేబీని ఆహ్వానించబోతున్నారు. ఇక మరికొన్ని గంటల్లో.. రామ్ చరణ్, ఉపాసన తల్లీ తండ్రులు కాబోతున్నారన్న న్యూస్.. అటు మెగా ఫ్యామిలీతో పాటు.. అభిమనుల్లో కూడా ఉత్సాహాన్ని నింపింది. మెగా కుటుంబం మరియు అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దీంతో ఆ మెగా వారసత్వం ఎంట్రీ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. డెలివరీ డేట్ దగ్గరకు వస్తుండటంతో.. చరణ్ కూడా నెల ముందు నుంచే షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి.. తన భార్యకు టైమ్ కేటాయించాడు. ఆమెతో కలిసి టైమ్ స్పెండ్ చేశాడు.
చాలా రోజులుగా.. ఉపాసన డెలివరీ జులైలో అంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇంకా టైమ్ ఉంది అనుకుంటుండగా.. సడెన్ గా హాస్పిటల్ లో జాయిన్ అయ్యింది ఉపాసన తాజాగా ఉపాసన డెలివరీ కోసం అపోలో హాస్పిటల్ కి చేరుకుంది. ఆమె వెంట రామ్ చరణ్ తో పాటు చిరంజీవి సతీమణి సురేఖ కూడా హాస్పిటల్ కి చేరుకున్నారు. రేపు (జూన్ 20) ఉపాసన డెలివరీ చేయనున్నారు. రేపు ఉదయం 6.30 లకు డెలివరీ ఉంటుందని సమాచారం. ఈ డెలివరీ కోసం ఫారిన్ నుంచి డాక్టర్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలియడంతో సోషల్ మీడియాలో మెగా అభిమానులు సందడి చేస్తున్నారు.
అయితే వచ్చే నెల కూడా రామ్ చరణ్ షూటింగ్స్ కు వెళ్లడం లేదు. కొన్ని రోజులు నుంచి షూటింగ్స్ కు ఆయన గ్యాప్ ఇచ్చారు. అయితే చరణ్.. డెలివరీ తరువాత కూడా ఆగష్టు వరకు షూటింగ్స్ లో పాల్గొనడని తెలుస్తుంది. పుట్టబోయే బిడ్డతోనే కొన్ని రోజులు గడపాలని చరణ్ భావిస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చెంజర్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే బిడ్డ పుట్టిన తరువాత చరణ్ అండ్ ఉపాసన.. చిరంజీవి ఇంటికి షిఫ్ట్ అవ్వనున్నారు. గ్రాండ్ పేరెంట్స్ అయిన చిరంజీవి అండ్ సురేఖ సంరక్షణలోనే తమ బిడ్డని పెంచాలని భావిస్తున్నట్లు ఇటీవల ఉపాసన ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.
,అంతే కాదు పుట్టబోయే బిడ్డకోసం స్పెషల్ గా ఉయ్యాల కూడా చేయించారు మెగా జంట. ఇక తాజాగా ఎం ఎం కీరవాణి) తనయుడు కాలభైరవ.. ఈ జంట కోసం ఓ అద్భుతమైన బహుమతిని పంపించాడు. ఒక స్పెషల్ ట్యూన్ చేసి ఉపాసనకు పంపించాడు. ఆ ట్యూన్ పిల్లలు మరియు తల్లిదండ్రుల్లో.. సంతోషం, ఆనందం, పాజిటివ్ ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుందని తెలియజేశాడు. ఇక ఈ ట్యూన్ ని ఉపాసన షేర్ చేస్తూ కాలభైరవకు థాంక్స్ చెప్పింది.