నాన్న మరణంపై అనుమానాలున్నాయి.. రాకేష్ మాస్టర్ కూతురు సంచలన వాఖ్యలు

Published : Jun 19, 2023, 08:12 PM IST
నాన్న మరణంపై అనుమానాలున్నాయి.. రాకేష్ మాస్టర్ కూతురు సంచలన వాఖ్యలు

సారాంశం

అనారోగ్యంత సడెన్ గా మరణించారు టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రఫర్ రాకేశ్ మాస్టార్. ఆయన మరణంతో బుల్లితెర తారలు దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఇక ఆయన మరణంపై అనుమానం వ్యాక్తం చేశారు..రాకేష్ మాస్టర్ కూతురు 

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్... వివాదాలకు కేరాఫ్ అడ్రస్...  రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం  రక్తపు విరేచనాలు, వాంతులు అవ్వడంతో.. ఆయన్ను గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం  రాకేశ్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల ఆయన మరణించినట్టు డాక్టర్లు వెల్లడించారు. ఇక ఈమధ్య  హనుమాన్ మూవీ  షూటింగ్ క్లైమాక్స్ సీన్ లో పాల్గొన్నప్పుడు కూడా ఆయనకు రక్తపు విరేచనాలు అయ్యాయి. కాని ఈ విషయాన్ని  రాకేష్ మాస్టర్ సీరియస్ గా తీసుకోలేదు. 

అనారోగ్యం కారణంగా రాకేశ్ మాస్టార్ చనిపోగా రాకేష్ మాస్టర్ కూతురు మాత్రం ఆయన  మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.వాంతులు  అయ్యాయని ఆయన అసిస్టెంట్ వెల్లడించారు. హాస్పిటల్ కి వెళ్తే.. రెండు నెలల కంటే ఎక్కువ బతకవని డాక్టర్లు చెప్పిన విషయాన్ని ఆమె  గుర్తు చేశారు. అయితే రాకేష్ మాస్టర్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి చనిపోవడం వెనుక వేరే కారణాలు ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుందని ఆమె అన్నారు.

ఎన్ని వివాదాలు ఉన్నా.. ఎన్ని వివాదాస్పద వాఖ్యలు చేసినా.. రాకేష్ మాస్టర్ మనసు ఎంతో మంచిది. కోపం ఎక్కువ అయినా...రాకేష్ మాస్టర్ ఎప్పుడూ గల గల మాట్లాడుతుంటారు. ఆయన ఇక లేరని తెలిసి ఫ్యామిలీతో పాటు.. ఆయన శిష్యులు కూడా బాధపడుతున్నారు. కొంత మంది బోరున విలపిస్తున్నారు. ఇక ఆయన మరణవార్త తెలిసి స్టార్ కొరియోగ్రఫర్.. రాకేష్ మాస్టర్ ప్రియశిష్యుడు శేఖర్ మాస్టార్ నివాళి అర్పించారు. కన్నీటిపర్యంతం అయ్యారు శేఖర్  మాస్టర్. 

తన తండ్రి మృతిపై అనుమానం ఉందని రాకేష్ మాస్టర్ కూతురు వెల్లడించారు. ఆయన చనిపోయారని తెలిసి షాక్ అయ్యానని, భయం వేసిందని ఆమె అన్నారు. అంతకు ముందు ఫోన్ చేసి తనతో మాట్లాడారని అన్నారు. చాలా నార్మల్ గా ఉన్న వ్యక్తి. రెండు రోజుల్లో కలుస్తానని అన్నారు. నిజంగానే చనిపోయారా? లేక ఏమైనా జరిగిందా? అని అనుకున్నానని ఆమె అన్నారు. వైజాగ్ నుంచి వచ్చాను, కొంచెం అనారోగ్యంగా ఉందని రాకేష్ మాస్టర్ ఫోన్ లో అన్నారని ఆమె వెల్లడించారు. అంతా బాగానే ఉందన్నారని. కాని ఇంతలో ఇలా ఎలా జరిగిందనేది అర్ధం కావడం లేదన్నారు. 

ఇక రాకేష్ మాస్టర్  అనారోగ్యంతో చనిపోలేదని.. దానికి వేరే కారణాలు ఉండి ఉంటాయేమో అన్న అనుమానం ఆమె వ్యాక్తం చేశారు. అంతే కాదు.. చాలా నార్మల్ గా ఉన్న వ్యాక్తికి సడెన్ గా  ఆర్గాన్స్ ఎలా ఫెయిల్ అవుతాయని ఆమె ప్రశ్నించారు. తన తండ్రికి షుగర్, ఎసిడిటీ లాంటివి ఉన్నాయి కాని ఒక్కసారిగా  అవయవాలు పాడయ్యేంత అనారోగ్యం తనకి ఎప్పుడూ కలగలేదన్నారు.  అంతే కాదు తన తండ్రి జనరల్ చెకప్ కోసం వారానికో, 15 రోజులకో హాస్పిటల్ కి వెళ్తుంటారు. మరి అప్పుడు  తన అనారోగ్యం తెలుస్తుంది కదా..లక్షణాలు ముందే కనిపించేవి కదా.. అన్నారు. అందుకే తన తండ్రి మరణంపై తనకు అనుమానాలు ఉన్నాయి అంటోంది రాకేష్ మాస్టర్ కూతురు. 

PREV
click me!

Recommended Stories

Sreenivasan: నటుడు శ్రీనివాసన్ ని ఆరాధించిన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఏకంగా తన పాత్రకి డబ్బింగ్‌
కృష్ణ ను భయపెట్టిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కు చెక్ పెట్టడానికి సూపర్ స్టార్ మాస్టర్ ప్లాన్