
లోకనాయకుడు కమల్‌హాసన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ఇండియన్ 2. 94లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా తెరకెక్కుతోంది. అప్పుడు ఆ సినిమాను డైరెక్ట్ చేసిన శంకర్ ఈ ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది.
శకర్ ఇటు రామ్ చరణ్ తో గమ్ చేంజర్ లో నటిస్తూనే .. ఇండియన్ 2 షూటింగ్ కూడా చేస్తున్నాడు. ఇక రామ్ చరణ్.. తన భార్య ఉపాసన డెలివరీకోసం రెండు నెలలు షూటింగ్స్ కు గ్యాప్ ఇవ్వడంతో.. శంకర్ ఇండియన్ 2సినిమాను పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ నెల చివరికల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అంతే కాదు కోలీవుడ్ నుంచి మరో బెంచ్ మార్క్ సినిమా లోడింగ్.. అంటూ బయటకు వచ్చిన అప్‌డేట్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది.ఇప్పటికే శంకర్ టీం ఇండియన్ 2 షూటింగ్‌లో భాగంగా చెన్నై , లాస్ ఏంజెల్స్, తైవాన్, సౌతాఫ్రికా ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు షూటింగ్ చేశారు. ఆయా లొకేషన్లలో సాంగ్స్‌తోపాటు ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేసినట్టు ఇన్‌సైడ్ టాక్. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ కథతో వస్తున్న ఈసినిమాలో బాబీ సింహా, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇక మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే..? ఇండియన్ 2లో డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ ఇండియన్ 2 సినిమాను నిర్మిస్తున్నారు.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా.. ఇప్పటికే రిలీజ్ అయిన ఇండియన్ 2 మూవీ అప్ డేట్స్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక కమల్ హాసన్ ఈసినిమాతో పాటు మణిరత్నం దర్శకత్వంలో KH234వ ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇండియన్ 2 పూర్తయ్యాక ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నాడు. మరోవైపు KH233 ప్రాజెక్ట్‌ను హెచ్ వినోథ్ డైరెక్షన్‌లో చేయబోతున్నాడు.