Puneeth Rajkumar: పునీత్ కుటుంబానికి రాంచరణ్ పరామర్శ.. సొంత ఫ్యామిలీ మెంబర్, భావోద్వేగంతో..

pratap reddy   | Asianet News
Published : Nov 03, 2021, 02:28 PM IST
Puneeth Rajkumar: పునీత్ కుటుంబానికి రాంచరణ్ పరామర్శ.. సొంత ఫ్యామిలీ మెంబర్, భావోద్వేగంతో..

సారాంశం

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణంతో యావత్ సినీ లోకం, లక్షలాది మంది అభిమానులు షాక్ నుంచి తేరుకోలేదు. వ్యక్తిత్వం, నటనతో కన్నడ నాట ఎనలేని ఖ్యాతి గడించారు పునీత్.

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణంతో యావత్ సినీ లోకం, లక్షలాది మంది అభిమానులు షాక్ నుంచి తేరుకోలేదు. వ్యక్తిత్వం, నటనతో కన్నడ నాట ఎనలేని ఖ్యాతి గడించారు పునీత్. 46 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో మరణించడం అత్యంత దిగ్భ్రాంతికర అంశం. టాలీవుడ్ లో కూడా పునీత్ కు ఎందరో సన్నిహితులు, స్నేహితులు ఉన్నారు. 

బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్ లాంటి తెలుగు స్టార్స్ బెంగళూరు వెళ్లి . Puneeth Rajkumar కు నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా నేడు Ram Charan పునీత్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులని పరామర్శించారు. శోకసంద్రంలో ఉన్న పునీత్ కుటుంబాన్ని ఓదార్చారు. ఉదయం 11 గంటలకు రాంచరణ్ పునీత్ నివాసానికి వెళ్లారు. 

అనంతరం రాంచరణ్ మీడియాతో మాట్లాడుతూ.. పునీత్ మా సొంత ఫ్యామిలీ మెంబర్. ఆయన మరణించారంటే జీర్ణించుకోలేకపోతున్నాను. మాటలు రావడం లేదు. పునీత్ ఎంతో నిజాయతీ కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా బాధాకరం. పునీత్ అభిమానులు, సన్నిహితులు నిరాశపడొద్దు, ధైర్యంగా ఉండాలి అని రాంచరణ్ సూచించారు. పునీత్ కుటుంబానికి రాంచరణ్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

Also Read: పునీత్ రాజ్ కుమార్ ని అవమానిస్తూ పోస్ట్.. నెటిజన్ అరెస్ట్, అంతా శోకంలో మునిగిపోయిన వేళ

జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ అక్టోబర్ 29న పునీత్ గుండె పోటుకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో మరణించారు. సినీ రాజకీయ ప్రముఖులంతా పునీత్ కు నివాళులు అర్పించారు. ఇక మెగా ఫ్యామిలీతో దశాబ్దాల కాలం నుంచి పునీత్ కుటుంబానికి రిలేషన్ ఉంది. పునీత్ తండ్రి లెజెండ్రీ నటుడు రాజ్ కుమార్ కు చిరంజీవి ఎంతో ఇష్టమైన వ్యక్తి. అలా రాంచరణ్, పునీత్ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. 

Also Read: Sara Ali Khan: మా అమ్మ పోర్న్ సైట్ నడుపుతోందనుకున్నా.. సారా అలీ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే