Asianet News TeluguAsianet News Telugu

Sara Ali Khan: మా అమ్మ పోర్న్ సైట్ నడుపుతోందనుకున్నా.. సారా అలీ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సారా అలీ ఖాన్ క్రేజీ బ్యూటీగా మారిపోయింది. రెండు మూడు చిత్రాలతోనే బాలీవుడ్ ఫ్యూచర్ స్టార్ గా మారిపోయింది.

Sara Ali Khan sensational comments on her parents
Author
Hyderabad, First Published Nov 3, 2021, 1:21 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సారా అలీ ఖాన్ క్రేజీ బ్యూటీగా మారిపోయింది. రెండు మూడు చిత్రాలతోనే బాలీవుడ్ ఫ్యూచర్ స్టార్ గా మారిపోయింది. సారా అలీ ఖాన్ ఎప్పుడూ నవ్వుతూ, చలాకీగా జోకులు వేస్తూ కనిపిస్తుంది. దీనితో సారా మంచి మాటకారి అనే ముద్ర కూడా పడింది. 

ఇదిలా ఉండగా Sara Ali Khan ఎలాంటి విషయం గురించి అయినా నిర్మొహమాటంగా మాట్లాడేస్తుంది.  సారా అలీ ఖాన్ తల్లిదండ్రులు Saif Ali Khan, అమృత సింగ్ చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు. తాజాగా సారా అలీ ఖాన్ తన తల్లిదండ్రుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. 

చిన్నతనంలో తన తల్లిదండ్రులు ఇద్దరూ చెడ్డవాళ్ళని భావించేదట. అందుకు కారణం సైఫ్ నటించిన 'ఓంకారా'.. తన తల్లి నటించిన 'కల్యుగ్' చిత్రాలే కారణం అని సారా అలీ ఖాన్ అంటోంది. ఓంకారా చిత్రంలో సైఫ్ ఎక్కువగా బూతులు మాట్లాడతారు. కల్యుగ్ మూవీలో తన తల్లి నెగిటివ్ షేడ్స్ లో నటించింది. ఆ మూవీలో అమృత సింగ్ పోర్న్ చిత్రాల బిజినెస్ చేసే మహిళగా నటిస్తుంది. 

దీనితో రియల్ లైఫ్ లో కూడా తమ తల్లిదండ్రులు అలాంటివారే అని భ్రమపడినట్లు సారా చెప్పుకొచ్చింది. ఆ రెండు చిత్రాల ప్రభావం వల్ల తన తల్లిదండ్రులపై చాలా కాలం పాటు చెడు అభిప్రాయం ఉండేదని సారా రివీల్ చేసింది. పెద్దయ్యాక నెమ్మదిగా చెడు అభిప్రాయం పోయినట్లు సారా తెలిపింది. 

Also Read: అదరగొట్టిన రెండు జడల పాప.. శారీ లుక్ లో ప్రియమణి స్టన్నింగ్ ఫోజులు

సో సినిమాలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. సారా ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ షో తో కనువిందు చేస్తోంది. సినిమాల్లోకి రాకముందు 90 కిలోల అధిక బరువు ఉన్న సారా అలీ ఖాన్ ఇప్పుడు నాజూగ్గా మారిపోయింది. తన తల్లి ప్రోత్సాహంతో డైట్, జిమ్ వర్క్ చేస్తూ నాజూగ్గా మారినట్లు సారా పలు ఇంటర్వ్యూలలో పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios