పాపం నాని...రెండు వైపులా పోటే,పోటీనే

Surya Prakash   | Asianet News
Published : Nov 03, 2021, 02:10 PM IST
పాపం నాని...రెండు వైపులా పోటే,పోటీనే

సారాంశం

వరస పరాజయాల్లో ఉన్న నానికి ఈ సినిమా విజయం ఎంతో ముఖ్యం. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో ‘శ్యామ్ సింగ్ రాయ్’ ని విడుదల చేయటానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం  ‘శ్యామ్ సింగ రాయ్’. ఈ సినిమాలో నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటీష్ కాలంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ఒక వింటేజ్ డ్రామాలా అనిపిస్తుంది శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలకానుంది. 

వరస పరాజయాల్లో ఉన్న నానికి ఈ సినిమా విజయం ఎంతో ముఖ్యం. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో ‘శ్యామ్ సింగ్ రాయ్’ ని విడుదల చేయటానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి పోటీ ఎక్కువగా కనపడుతోంది. వారం ముందుగా అంటే డిసెంబర్ 17న  అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం రిలీజ్ అవుతోంది. అలాగే శ్యామ్ సింగరాయ్ రిలీజ్ రోజే రవితేజ నటించిన ఖిలాడీ కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రెండు క్రేజ్ ఉన్న ప్రాజెక్టుల మధ్య విడుదల అవుతూండటంతో నాని చిత్రంపై వాటి ఇంపాక్ట్ ఏమేరకు ఉండబోతోంనేది ట్రేడ్ లో చర్చగా మారింది. 
  
శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో సాయి పల్లవి,(Sai Pallavi ) కృతి శెట్టి (Krithi Shetty) లతో పాటు మరో టాలెంటెడ్ బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ (Netflix) భారీ ధర చెల్లించి దక్కించుకుందని తెలుస్తోంది. అయితే థియేటర్లలో సినిమా విడుదల అయిన అనంతరం ఓ నెల తర్వాత మాత్రమే నెట్ ఫ్లిక్స్ లో శ్యామ్ సింగ రాయ్  స్ట్రీమ్ కానుంది. దాదాపు 8 కోట్లు పెట్టి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను పొందిందని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

Also read Sara Ali Khan: మా అమ్మ పోర్న్ సైట్ నడుపుతోందనుకున్నా.. సారా అలీ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

ఇక ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా 50 కోట్లతో నిర్మిస్తున్నారు. దీనికి తోడు ఈ సినిమా ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం 30 కోట్లకు భారీ డీల్ జరిగిందని టాక్. దీంతో సినిమాకి పెట్టిన బడ్జెట్ లో అరవై శాతం రికవర్ అయిందని సమాచారం. 

Aslo read Raviteja: గజదొంగ 'టైగర్ నాగేశ్వరరావు' గా రవితేజ ... పాన్ ఇండియా రిలీజ్!
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే