
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటాడు. ఎప్పుడూ ఎక్కడకీ వెళ్ళడు.. బయట కనపించడం చాలా తక్కువ. అటు ఆయన భార్య ఉపాసన కూడా తన కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఎప్పుడో వినయ విధయ రామా షూటింగ్ టైమ్ లో జార్జియలో కలిసి ఎంజాయ్ చేశారు ఈ ఇద్దరు.. ఆతరువాత రీసెంట్ గా వెకేషన్ కు వెళ్ళి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక రామ్ చరణ్ గత మూడేళ్లుగా ట్రిపుల్ ఆర్ సినిమా బిజీలో ఉన్నాడు. అటు ఆచార్య నిర్మాణ పనులతో పాటు ఆ సినిమాలో మెగాస్టార్ తో కలిసి స్క్రీన్ శేర్ చేసుకున్నాడు. మరో వైపు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గా రాజమండ్రిలో మొదలైన ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమాల ప్రమోషన్లు.. హడావిడితో పాటు కారోనా వల్ల చాలా కాలం బయటకు వెళ్ళలేక పోయారు.
ఇక రిలాక్స్ అవ్వక తప్పదు అనుకున్నాడో ఏమో.. రీసెంట్ గా తన భార్య ఉపాసనతో కలిసి అవుటింగ్ వెళ్ళాడు చరణ్. రామ్ చరణ్ తో వెకేషన్ కు వెళ్తున్నాను అంటూ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ ఇద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కటి ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియో శేర్ చేసుకుంటున్నారు స్టార్ కపుల్
ఈ వెకేషన్ లోని సరదా సరదా మూమెంట్స్ ను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫిన్ లాండ్ లో రామ్ చరణ్ ఉపాసనతో కలిసి చేసిన అల్లరి.. గడిపిన ఫన్నీ సన్నివేశాలు వీడియోలుగా వదిలారు. అవి చూడ ముచ్చటగా ఉన్నాయి. చిన్న పిల్లలా మారిపోయి తెగ అల్లరి చేశారు రామ్ చరణ్, ఉపాసన.
ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ ను ఉపాసన ట్రాలీపై కూర్చొపెట్టి అటు ఇటూ తిప్పడం, అలాగే ఉపాసనను రామ్ చరణ్ తిప్పడం.. అంతేకాకుండా ఈ జంట ఫిన్ లాండ్ లో చేసిన మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. మెగా ఫ్యాన్స్ ఈ వీడియోస్ చూసి దిల్ ఖుష్ అవుతున్నారు. చరణ్, ఉపాసన మంచు తినడం, ఒక కుక్క పక్కన మంచులో రామ్ చరణ్ పడుకోవడం ఇలాంటివి ఇంకా ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.