ఆ నిర్మాత చేతికి 'ఉడుంబు' తెలుగు రీమేక్ రైట్స్.. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇవిగో..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 14, 2022, 04:36 PM IST
ఆ నిర్మాత చేతికి 'ఉడుంబు' తెలుగు రీమేక్ రైట్స్.. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇవిగో..

సారాంశం

మలయాళంలో విజయం సాధించిన ఉడుంబు చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. రీమేక్ హక్కులని గంగపట్నం శ్రీధర్ సొంతం చేసుకున్నారు.   

మలయాళీ కథలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది. మలయాళంలో విజయం సాధించిన చిత్రాలని తెలుగులో రీమేక్ చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. వెంకటేష్ దృశ్యం, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ లాంటి క్రేజీ చిత్రాలు మలయాళం కథలకు రీమేక్ గా వచ్చినవే. 

ఇటీవల మలయాళంలో విజయం సాధించిన 'ఉడుంబు' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర తెలుగు రీమేక్ హక్కులని నిర్మాత గంగపట్నం శ్రీధర్ సొంతం చేసుకున్నారు. 

శ్రీధర్  ఇంతకుముందు అంజలి టైటిల్ పాత్రలో చిత్రాంగద, సుమంత్ తో 'ఇదం జగత్' ఛార్మితో మంత్ర వంటి పలు చిత్రాలతో పాటు సుకుమార్ కుమారి 21ఎఫ్ చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేసి విజయం సొంతం చేసుకున్నారు. తాజాగా రమ్యకృష్ణతో కన్నడలో శివగామి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

పలు అగ్రనిర్మాణ సంస్థలు 'ఉడుంబు' తెలుగు రీమేక్ రైట్స్ కోసం పోటీపడినప్పటికీ.. ఈ చిత్రం హక్కులు తమకు దక్కడంపై నిర్మాత గంగపట్నం శ్రీధర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రం శ్రీవిఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై త్వరలోనే సెట్స్ కు వెళ్లనుంది. దర్శకత్వ శాఖలో విశేష అనుభవం కలిగిన యువప్రతిభాశాలి రత్నాకరం అనిల్ రాజు ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నాడు. ఇంకా టైటిల్ పెట్టని ఈ క్రేజీ చిత్రానికి ప్రస్తుతం స్క్రిప్ట్ పనులతోపాటు నటీనటులు-సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. 

మలయాళంలో భారీ విజయం నమోదు చేసిన 'ఉడుంబు' చిత్రాన్ని ఇప్పటికే హిందీలో జాన్ అబ్రహాం రీమేక్ చేస్తుండగా... తమిళంలో ఓ సీనియర్ హీరోయిన్ తన తనయుడ్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ రీమేక్ చేస్తున్నారు

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు