RRR Movie:ఆర్ ఆర్ ఆర్ క్రేజ్ క్యాష్ చేసుకునే మాస్టర్ ప్లాన్ వేసిన భీమ్లా నాయక్ నిర్మాత

Published : Mar 14, 2022, 04:37 PM ISTUpdated : Mar 14, 2022, 04:38 PM IST
RRR Movie:ఆర్ ఆర్ ఆర్ క్రేజ్ క్యాష్ చేసుకునే మాస్టర్ ప్లాన్ వేసిన భీమ్లా నాయక్ నిర్మాత

సారాంశం

ఆర్ ఆర్ ఆర్ విడుదలకు కేవలం రోజుల సమయం మాత్రమే ఉంది. దేశం ఆర్ ఆర్ ఆర్ మేనియాతో ఊగిపోతుంది. పలుమార్లు వాయిదా పడిన ఆర్ ఆర్ ఆర్ మార్చి 25న విడుదలవుతుండగా... ఈ క్రేజ్ క్యాష్ చేసుకుంటున్నాడు భీమ్లా నాయక్ నిర్మాత నాగ వంశీ. 

దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli)తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీపై భారీ హైప్ నెలకొని ఉంది. ఓవర్ సీస్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ బుకింగ్స్ మొదలైపోయాయి. ముఖ్యంగా యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే వన్ మిలియన్ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. రెండు వారాలు మిగిలి ఉండగానే ఈ స్థాయిలో బుకింగ్స్ దక్కడం ఆర్ ఆర్ ఆర్ మూవీపై అక్కడి ప్రేక్షకులకున్న క్రేజ్ అర్థమవుతుంది. తెలుగు సినిమాలకు మార్కెట్ ఉన్న ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో కూడా బుకింగ్స్ ఇదే స్థాయిలో ఉన్నాయి. 

కాగా యూఎస్ తర్వాత ఆస్ట్రేలియా తెలుగు సినిమాలకు అతిపెద్ద మార్కెట్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ ఆస్ట్రేలియా రైట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ(Naga Vamshi) దక్కించుకున్నారు. భారీ డిమాండ్ ఏర్పడగా పోటీ మధ్య సుమారు రూ 6.5 కోట్లకు ఆస్ట్రేలియా డిస్ట్రిబ్యూషన్ హక్కులు చేజిక్కించుకున్నారట.  పూర్తి పాజిటివ్ బజ్ నెలకొన్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్ట్రేలియాలో కూడా రికార్డు వసూళ్లు రాబట్టడం ఖాయమని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. దీంతో పెట్టుబడితో పాటు మంచి లాభాలు దక్కించుకోవడం లాంఛనమే అని చెప్పాలి. తెలివిగా చివరి నిమిషంలో ఆర్ ఆర్ ఆర్ హక్కులు దక్కించుకొని నాగవంశీ మరో ప్రాఫిటబుల్ వెంచర్ తన ఖాతాలో వేసుకున్నారు. 

ఈ మధ్య నాగవంశీ పట్టిందల్లా బంగారం అవుతుంది. డీజే టిల్లు సర్ప్రైజింగ్ హిట్ కొట్టింది. ఈ చిత్ర నిర్మాతగా ఆయనే ఉన్నారు. భీమ్లా నాయక్ చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు మిగిల్చింది. భారీ ధరకు రైట్స్ అమ్ముకున్న నాగవంశీకి మాత్రం భారీగా డబ్బులు ముట్టాయి. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా మరికొంత మొత్తం లభించింది. భీమ్లా నాయక్ నాగవంశీతో పాటు త్రివిక్రమ్ కి కోట్లు తెచ్చిపెట్టింది. 

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR)-చరణ్ ల మల్టీస్టారర్ గా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కింది. ఓవర్ సీస్ లో ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ బుకింగ్స్ మొదలైపోయాయి. యూఎస్ తో పాటు పలు దేశాల్లో ఆర్ ఆర్ ఆర్ బుకింగ్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. యూఎస్ లో అయితే అడ్వాన్స్ బుకింగ్స్ వన్ మిలియన్ మార్క్ కూడా దాటేశాయి. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు