తండ్రి చిరంజీవి సినీ ప్రస్థానంపై చరణ్ ఆసక్తికర ట్వీట్

Published : Sep 23, 2021, 10:32 AM IST
తండ్రి చిరంజీవి సినీ ప్రస్థానంపై చరణ్ ఆసక్తికర ట్వీట్

సారాంశం

తండ్రి చిరంజీవి(Chiranjeevi) సినీ ప్రస్థానాన్ని ఉద్దేశిస్తూ రామ్ చరణ్ సైతం ట్వీట్ చేశారు. '43 ఇయర్స్ స్టిల్ కౌంటింగ్' అంటూ.. చరణ్ కామెంట్ చేశారు. 

నటుడిగా మెగాస్టార్ చిరంజీవి 43వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఆయన మొదటి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలై 43సంవత్సరాలు అవుతుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ చేశారు. 22Aug నేను పుట్టినరోజైతే 22Sept నటుడిగా నేను పుట్టినరోజు.కళామతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు.మీ అందరికి నన్ను నటుడిగా పరిచయంచేసి మీ ఆశీస్సులు పొందినరోజు.నేను మరిచిపోలేనిరోజు.. అంటూ ట్వీట్ చేశారు. తనను ఆశీర్వదించిన తెలుగు ప్రేక్షకులకు ధనువాదాలు తెలిపారు. 


ఇక తండ్రి చిరంజీవి(Chiranjeevi) సినీ ప్రస్థానాన్ని ఉద్దేశిస్తూ రామ్ చరణ్ సైతం ట్వీట్ చేశారు. '43 ఇయర్స్ స్టిల్ కౌంటింగ్' అంటూ.. చరణ్ కామెంట్ చేశారు. రామ్ చరణ్ ట్వీట్ వైరల్ గా మారగా, మెగా ఫ్యాన్స్ లైక్స్ , కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు. 


ఇక మెగాస్టార్ వారసుడిగా వెండితెరకు పరిచయమైన రామ్ చరణ్ స్టార్స్ లో ఒకరిగా ఎదిగారు. ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అందుకొని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక ఆచార్య చిత్రం ద్వారా మొదటిసారి పూర్తి స్థాయిలో వెండితెరపై కలిసి సందడి చేయనున్నారు చిరు, చరణ్. 

PREV
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం