ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటిస్తోంది. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం విజయ్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తయింది.
యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లైగర్’. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగలైన్. ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తయింది. ఈ వారంలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ మేరకు షూటింగ్ స్పాట్‌లో ఉన్న విజయ్ దేవరకొండ ఫొటోని విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి,అందులో విజయ్ పాత్ర గురించి అందరిలో ఓ రకమైన ఆసక్తి మొదలైంది.
అందుతున్న సమాచారం మేరకు `లైగర్` విషయంలో మాత్రం పూరీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. లొకేషన్స్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇక, ఈ సినిమాలో హీరోను పూరీ సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నాడని సమాచారం. ఈ సినిమాలో విజయ్ పాత్ర నత్తిగా మాట్లాడుతుందట. విజయ్ దేవరకొండ లాంటి భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోతో అలాంటి పాత్ర చేయించడం ఖచ్చితంగా డేరింగ్ చేయటం లాంటిదే. నేషనల్ ఛాంపియన్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న క్యారెక్టర్‌కి నత్తి పెట్టడం పూరీ స్పెషాలిటీ అంటున్నారు.
అయితేనేం ఈ సినిమాలో డైలాగ్‌లు, పంచ్‌లు పూరీ తరహాలో అదిరిపోయే స్థాయిలో ఉండబోతున్నాయట. సాధారణ కథనే పూరీ స్టైల్లో పూర్తి డిఫరెంట్‌గా తెరకెక్కిస్తున్నారట. ఇక, `లైగర్`కి మరో ప్లస్ పాయింట్.. రమ్యకృష్ణ. విజయ్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించిందట. కొడుకు జాతీయ ఛాంపియన్ కావాలని కలలు కంటూ, తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. రఫ్ అండ్ టఫ్‌గా ఉండే పాత్రలో రమ్య అద్భుతంగా నటించిందట.
ప్రమోషన్ కోసం విడుదల చేసిన ఫొటోలో విజయ్ పొడవాటి జుత్తుతో ఠీవిగా వెనక్కి తిరిగి కూర్చొని కనిపించాడు. చొక్కా లేకుండా బాక్సింగ్ బరిలోకి దిగిన సన్నివేశంలా అనిపిస్తుంది. ‘రక్తం.. చెమట.. హింస’ అంటూ ఈ ఫొటోకి విజయ్ క్యాప్షన్ ఇచ్చాడు. ఒక్క లుక్‌తోనే సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. విజయ్‌తోపాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటిస్తోంది. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం విజయ్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.