బాలీవుడ్‌ కి శర్వానంద్ ఫ్లాఫ్ మూవీ రీమేక్!

Surya Prakash   | Asianet News
Published : Sep 23, 2021, 10:24 AM IST
బాలీవుడ్‌ కి శర్వానంద్ ఫ్లాఫ్ మూవీ రీమేక్!

సారాంశం

ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత అజయ్ కపూర్ హిందీలో నిర్మించనున్నారు. ఈ విషయాన్ని అజయ్ కపూర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు స్వయంగా ప్రకటించారు. త్వరలోనే దర్శకుడు, నటీనటుల వివరాలను విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.


తమిళ్‌లో మోడరన్ క్లాసిక్ అని పేరు తెచ్చుకున్న 96  సినిమాని తెలుగులో 'జాను' పేరుతో రీమేక్ చేశారు దిల్ రాజు. తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తమిళ్‌లో విజయ్ సేతుపతి, త్రిష తమ అభినయంతో ప్రాణం పోసిన జానకి, రామ్ పాత్రలకి తెలుగులో సమంత, శర్వానంద్ ని ఫిక్స్ చెయ్యడం, అలాగే తమిళ్‌లో ఈ సినిమాని తెరకెక్కించిన మేజర్ టెక్నీషియన్స్ ఈ రీమేక్‌కి వర్క్ చెయ్యడం, ట్రైలర్ కూడా ఒరిజినల్ ఫీల్‌ని క్యారీ చెయ్యడంతో ఈ సినిమాపై మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అయితే 'జాను' ఆ పోజిటివిటీ నిలబెట్టుకోలేకపోయింది. మంచి రివ్యూలు వచ్చినా ప్రేక్షకులనుండి  ప్రశంసలు దక్కించుకోలేకపోయింది. అయితే ఇప్పుడీ సినిమా హిందీలోకి రీమేక్ అవుతోంది.

విజయ్ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన ‘96’ చిత్రం భారీ విజయాన్ని అందుకొంది. దాంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత అజయ్ కపూర్ హిందీలో నిర్మించనున్నారు. ఈ విషయాన్ని అజయ్ కపూర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు స్వయంగా ప్రకటించారు. త్వరలోనే దర్శకుడు, నటీనటుల వివరాలను విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.
 
అప్పటికి 96 ఉన్న ఫీల్ జానులో కనిపిస్తుంది. జాను, రామ్‌ల మధ్య వచ్చే సీన్స్ చాలా వరకు మనసుకు హత్తుకుంటాయి. వాళ్ళ తొలిప్రేమని తలచుకుని వాళ్ళు బాధ పడే సన్నివేశాలు సున్నితంగా గుండెను తాకాయి. మధ్య మధ్యలో సహజంగా పుట్టే ఫన్ కూడా హాయిగా అనిపిస్తుంది. అయితే సినిమా స్లో గా ఉంది, అలాగే ల్యాగ్స్ ఉండటం తెలుగు వెర్షన్ కు ఇబ్బంది పెట్టింది. వీటికి తోడు సినిమాలో ముందు ముందు ఏం జరగబోతుంది అనేది ముందే అర్ధమవటం కూడా సమస్యగా మారింది. ఇవన్ని దృష్టిలో పెట్టుకుని హిందీ రీమేక్  సినిమా టీమ్ కాస్త కేర్ తీసుకుని ఉండి ఉంటే జాను కంటే మెరుగయిన ఫలితం దక్కుతుంది.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి