పిఠాపురంలో రాంచరణ్ పర్యటన.. ఊహించని నిర్ణయమే, క్రేజీ డీటెయిల్స్ 

Published : May 10, 2024, 09:02 PM IST
పిఠాపురంలో రాంచరణ్ పర్యటన.. ఊహించని నిర్ణయమే, క్రేజీ డీటెయిల్స్ 

సారాంశం

మెగా ఫ్యామిలీ నుంచి సాయిధరమ్ తేజ్, వైష్ణవ్, వరుణ్ తేజ్ ఇప్పటికే పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక లాస్ట్ పంచ్ అన్నట్లుగా శనివారం రోజు మెగా పవర్ స్టార్ రాంచరణ్ రంగంలోకి దిగుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం తుది దశకి చేరుకుంది. సోమవారం రోజు ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీనితో చేయాల్సిన ప్రచారమంతా ఇప్పుడే చేసేస్తూ అన్ని పార్టీలు పోలింగ్ కి సిద్ధం అవుతున్నాయి ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజక వర్గం ప్రత్యేక ఆకర్షణగా మారింది. 

మెగా ఫ్యామిలీ నుంచి సాయిధరమ్ తేజ్, వైష్ణవ్, వరుణ్ తేజ్ ఇప్పటికే పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుల్లితెర నటులు, జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా పవన్ కళ్యాణ్ కి భారీ మెజారిటీ ఇవ్వాలని పిఠాపురంలో ప్రతి ఇల్లూ తిరిగారు. భీమ్లా నాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా పిఠాపురంలో పవన్ కోసం ప్రచారం చేశారు. 

ఇక లాస్ట్ పంచ్ అన్నట్లుగా శనివారం రోజు మెగా పవర్ స్టార్ రాంచరణ్ రంగంలోకి దిగుతున్నారు. ఇది ఊహించని నిర్ణయమే అని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి నేరుగా గ్రౌండ్ లోకి దిగకపోయినా తన తమ్ముడికి అండదండలు అందించారు. 

ఇప్పుడు చరణ్ వంతు వచ్చింది. అయితే చరణ్ డైరెక్టర్ ఎన్నికల ప్రచారం కోసం అని చెప్పకుండా.. పిఠాపురంలో  శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని రాంచరణ్ తన తల్లి సురేఖతో కలసి సందర్శించబోతున్నాడు. పనిలో  పనిగా తన బాబాయ్ కి ప్రచారం కూడా జరిగిపోతుందనేది లోపల వినిపిస్తున్న టాక్. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్