సమంత దగ్గర ఉద్యోగం చేస్తారా? ఈ అర్హతలు ఉంటే చాలు, వెంటనే అప్లై చేయండి!

By Sambi ReddyFirst Published May 10, 2024, 7:09 PM IST
Highlights

సమంత బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆమె వద్ద ఉద్యోగం చేసే అవకాశం కల్పించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. మీకు కనుక ఈ అర్హతలు ఉంటే ఉద్యోగానికి అప్లై చేయవచ్చు. 
 

సమంత మళ్ళీ బిజీ అయ్యింది. ఓ ఏడాది పాటు విశ్రాంతి తీసుకున్న ఈ స్టార్ లేడీ ఇటీవల కొత్త ప్రాజెక్ట్ ప్రకటించింది. సమంత నిర్మాతగా కూడా మారడం విశేషం. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసింది. మొదటి ప్రాజెక్ట్ గా మా ఇంటి బంగారం టైటిల్ తో మూవీ చేస్తుంది. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో సమంతనే హీరోయిన్. బర్త్ డే నాడు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసింది. ఎర్ర చీర కట్టుకొని, చేతిలో తుపాకీ పట్టుకొని వీరనారి గెటప్ లో సమంత మైండ్ బ్లాక్ చేసింది. 

ఇది పీరియాడిక్ రివల్యూషనరీ డ్రామా అనే సందేహం కలుగుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత ఏడాది సమంత నటించిన శాకుంతలం, ఖుషి విడుదలయ్యాయి. శాకుంతలం నిరాశపరిచింది. ఖుషి ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఆమె ప్రధాన పాత్ర చేసిన వెబ్ సిరీస్ హనీ బన్నీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. వరుణ్ ధావన్ సమంత కు జంటగా నటిస్తున్నాడు. ఇది హాలీవుడ్ సిటాడెల్ సిరీస్ కి ఇండియన్ వెర్షన్. 

నటిగా కొనసాగుతూనే సమంత వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే. సాకి పేరుతో సమంత గార్మెంట్ బ్రాండ్ నిర్వహిస్తుంది. కాగా ఈ సంస్థలో పని చేసేందుకు ఉద్యోగ ప్రకటన చేసింది సమంత. తగు అర్హతలు ఉన్నవాళ్లు వివరాలు పంపాలని ప్రకటించింది. ఫ్యాషన్ డిజైన్ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్, ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్, బ్రాండ్ మార్కెటింగ్ తో పాటు మరో రెండు పొజిషన్స్ కొరకు ఆమె అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తులు కోరింది. ప్రకటనలో పొందు పరిచిన ఈ మెయిల్ అడ్రస్ కి వివరాలు పంపాలని వెల్లడించారు. 

మరి సమంతకు చెందిన సంస్థలో పని చేయడం అంటే మాటలా. అర్హత ఉంటే ఆలస్యం చేయకుండా అప్లై చేయండి. ఇదిలా ఉంటే సమంత అల్లు అర్జున్ తో మరోసారి జతకట్టనుందని వార్తలు వస్తున్నాయి. అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రానికి అల్లు అర్జున్ సైన్ చేశాడట. ఈ భారీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా సమంత ఎంపిక అయ్యారట. అధికారిక సమాచారం రావాల్సి ఉంది. 

click me!