'గీత గోవిందం'పై రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్!

Published : Aug 17, 2018, 02:41 PM ISTUpdated : Sep 09, 2018, 12:53 PM IST
'గీత గోవిందం'పై రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్!

సారాంశం

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది 'గీత గోవిందం'. చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. 

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది 'గీత గోవిందం'. చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోంది. ప్రజలతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, మహేష్ బాబు వంటి స్టార్ సెలబ్రిటీలతో పాటు తాజాగా రామ్ చరణ్ కూడా ఈ సినిమాపై స్పందించారు. 'అర్జున్ రెడ్డి సినిమా తరువాత పెర్ఫెక్ట్ ఛేంజ్ ఓవర్ సినిమా ఇది. విజయ్ దేవరకొండ, రష్మికల సహజ నటనను చూడడం ట్రీట్ లా అనిపించింది. గోపి సుందర్ అద్భుతమైన సంగీతం అందించారు. దర్శకుడు పరశురామ్ చాలా బాగా రాసి ఎగ్జిక్యూట్ చేశారు. ఈ సినిమాతో అసోసియేట్ అయి ఉన్న టెక్నీషియన్స్‌ కి, ఆర్టిస్టులకి, జిఏ2 పిక్చర్స్ టీమ్ కి అభినందనలు' అని సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ పెట్టారు. 

PREV
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం