ఎవరు మీలో కోటీశ్వరులు: ఎన్టీఆర్ హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ చెప్పిన చరణ్

pratap reddy   | Asianet News
Published : Aug 22, 2021, 09:36 PM IST
ఎవరు మీలో కోటీశ్వరులు: ఎన్టీఆర్ హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ చెప్పిన చరణ్

సారాంశం

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో ఘనంగా ప్రారంభం అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో ఘనంగా ప్రారంభం అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ తర్వాత తారక్ హోస్ట్ గా చేస్తున్న షో ఇది. తొలి ఎపిసోడ్ ని మరింత ఘనంగా ఆరంభించేందుకు మెగా పవర్ స్టార్ రాంచరణ్ జత కలిశాడు. 

ఈ షో తొలి ఎపిసోడ్ కి రాంచరణ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ స్టైలిష్ ఎంట్రీతో షోని ప్రారంభించారు. నెమ్మదిగా మాటలు కలిశాక నిబంధనల ప్రకారం ఎన్టీఆర్ ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. 

ఆరంభంలో రాంచరణ్ కు చాలా సులువైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎన్టీఆర్..చరణ్ ని ఒక్కో ప్రశ్న అడగడం.. చరణ్ సమాధానం ఇచ్చాక కొంత సమయం ఆ ప్రశ్న గురించి సరదాగా మాట్లాడుకోవడం లాంటి అంశాలతో షో ఎంటర్టైనింగ్ గా ఆరంభం అయింది. 

ఎన్టీఆర్ రాంచరణ్ ని గురువు అనే అర్థం వచ్చే పదం ఏది అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. వాటిలో ఆచార్య కూడా ఉంది. అంతే చరణ్ వెంటనే 'ఆచార్య' అని సరైన సమాధానం ఇచ్చాడు. తర్వాత వీరిద్దరి మధ్య మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం గురించి సరదా ముచ్చట్లు జరిగాయి. 

నాన్నగారు నాకు ఇంట్లో కూడా ఆచార్యనే అని రాంచరణ్ అన్నాడు. దీనికి ఎన్టీఆర్ మాట్లాడుతూ నీకు మాత్రమే కాదు నాకు కూడా ఆచార్యనే అని ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. 

తర్వాతి ప్రశ్న కెమెరాకు సంబంధించినది. దానిని కూడా చరణ్ కరెక్ట్ గా ఆన్సర్ చేశాడు. ఈ ప్రశ్న తర్వాత జంతువుల గురించి వీరిద్దరూ చర్చించుకున్నారు. ఈ చర్చలో రాంచరణ్ కు కుక్కలు అంటే చాలా ఇష్టం అని తెలిసిందే. రాంచరణ్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఇంట్లో హైదరాబాద్ లో ఎక్కడా లేని పెద్ద సైజు కుక్క ఉండేది. ఆ కుక్క చనిపోయింది అని చరణ్ అనగా.. ఆ కుక్క చనిపోయిన తర్వాత నా హార్ట్ బ్రేక్ అయింది అని ఎన్టీఆర్ అన్నాడు. 

ఈ ప్రశ్న తర్వాత మరో ఎంటర్టైనింగ్ వ్యవహారం షోలో నడిచింది. ప్రశ్నలో భాగంగా ఎన్టీఆర్ ఓ సాంగ్ ని చరణ్ కు వినిపించారు. ఆ సాంగ్ లో వాయిస్ ఎవరిదో చరణ్ చెప్పాలి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చరణ్ కు నల్లేరుపై నడకే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జానీ చిత్రం కోసం పాడిన.. నువ్ సారా తాగుట మాను రన్నో అనే సాంగ్ అది. చరణ్ వెంటనే బాబాయ్ పవన్ కళ్యాణ్ అని సమాధానం ఇచ్చాడు. 

పవన్ కళ్యాణ్ తో రిలేషన్ ని షేర్ చేసుకోవాలని ఎన్టీఆర్ కోరగా.. చరణ్ ఎమోషనల్ వర్డ్స్ చెప్పారు. నాన్నగారు షూటింగ్స్ తో బిజిగా ఉన్నప్పుడు బాబాయే తనని తండ్రిలా చూసుకున్నారు అని రాంచరణ్ తెలిపాడు. తమది మాటల్లో చెప్పలేని బంధం అని చరణ్ తెలిపాడు. నాన్నగారు నాతో చెప్పలేని విషయాలని బాబాయ్ చెప్పేవారు అని రాంచరణ్ తెలిపాడు. 

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?