వారంలో ఒక్కసారి ప్రభాస్ ఇంటికి వెళితే ఇక అంతే సంగతి : సుధీర్ బాబు

By telugu teamFirst Published Aug 22, 2021, 7:25 PM IST
Highlights

హీరో సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ శ్రీదేవి సోడా సెంటర్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ ప్రేమకథా చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగష్టు 27న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. 

హీరో సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ శ్రీదేవి సోడా సెంటర్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ ప్రేమకథా చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగష్టు 27న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుధీర్ బాబు స్పీచ్ ఆకట్టుకుంది. శ్రీదేవి సోడా సెంటర్ చిత్రానికి ప్రభాస్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు. శ్రీదేవి సోడా సెంటర్ టీంతో ప్రభాస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ టీజర్ కూడా రిలీజయింది. 

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుధీర్ బాబు ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. మొన్న ప్రభాస్ ఇంటికి వెళ్ళాను. మంచి తిండి పెట్టాడు. వారంలో ఒక్కరోజు ప్రభాస్ ఇంటికి వెళితే చాలు. సిక్స్ ఫ్యాక్స్, ఫిట్ నెస్ లు ఏమీ ఉండవు.. అన్నీ గల్లంతే అని సుధీర్ బాబు సరదాగా కామెంట్ చేశాడు. 

అలాగే తన బావ సూపర్ స్టార్ మహేష్ గురించి ప్రస్తావించి అభిమానులని ఖుషీ చేశాడు. సర్కారు వారి పాట టీజర్ లో మహేష్ స్టయిల్ ని ఇమిటేట్ చేశాడు. ఇక శ్రీదేవి సోడా సెంటర్ మూవీ విషయానికి వస్తే.. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ట్రయిల్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఆనంది ఈ చిత్రంలో సుధీర్ బాబుకు జోడిగా నటిస్తోంది. మణిశర్మ సంగీత దర్శకుడు. 

click me!