ఖుష్బూ లేటెస్ట్ లుక్ చూసి పెళ్లి ప్రపోజల్ పెట్టిన నెటిజన్.. ఆమె సమాధానం వింటే..

pratap reddy   | Asianet News
Published : Aug 22, 2021, 06:15 PM IST
ఖుష్బూ లేటెస్ట్ లుక్ చూసి పెళ్లి ప్రపోజల్ పెట్టిన నెటిజన్.. ఆమె సమాధానం వింటే..

సారాంశం

అలనాటి నటి ఖుష్బూ ఐదుపదుల వయసులో కూడా గ్లామర్ గా కనిపిస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఖుష్బూ అందానికి ఫిదా అయిన తమిళులు గుడి కూడా కట్టేశారు. అలాంటిది ఆమె క్రేజ్.

అలనాటి నటి ఖుష్బూ ఐదుపదుల వయసులో కూడా గ్లామర్ గా కనిపిస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఖుష్బూ అందానికి ఫిదా అయిన తమిళులు గుడి కూడా కట్టేశారు. అలాంటిది ఆమె క్రేజ్. తాజాగా ఖుష్బూ అందానికి ముగ్దుడైన ఓ నెటిజన్ ఆమెకు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. 

నెటిజన్ కు, ఖుష్బూకి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఖుష్బూ తన ఫిజిక్ పై ఫోకస్ పెట్టి కసరత్తులు చేసింది. రీసెంట్ ఫోటో షూట్ లో ఆమె అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ స్టన్నింగ్ మేకోవర్ తో ఆకట్టుకుంది. 

ట్రెండీ డ్రెస్ లో అదరగొట్టేసింది. ఆమె ఫొటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఖుష్బూ లేటెస్ట్ లుక్ చూసిన ఓ నెటిజన్.. మేడం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది అని ప్రపోజల్ పెట్టాడు. 

దీనికి ఖుష్బూ అందరిని ఆకట్టుకునే సమాధానం ఇచ్చింది. 'ఓహ్.. సారీ నువ్ బాగా లేట్ అయ్యావ్. 21 ఏళ్ల క్రితం ఈ ప్రశ్న అడిగి ఉండాల్సింది. అయినా సరే ఒకసారి నా భర్తని అడిగి చెబుతా' అని ఫన్నీ రిప్లై ఇచ్చింది. మరోసారి ఆ నెటిజన్.. మీ భర్త నుంచి సమాధానం వచ్చిందా మేడం అని అడిగాడు. 

దీనికి ఖుష్బూ స్పందిస్తూ.. ఆయనకు నేను మాత్రమే భార్యని.. కాబట్టి సారీ అని చెప్పామన్నారు.  నన్ను వదులుకునేందుకు రెడీగా లేరు' అని ఖుష్బూ సమాధానం ఇచ్చింది. 

 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today డిసెంబర్ 06 ఎపిసోడ్ : రామరాజు గ్రీన్ సిగ్నల్.. వల్లికి ఉద్యోగం తిప్పలు, ఇరికించిన నర్మద, ప్రేమ
Superstar Krishna హీరోగా పూరీ జగన్నాథ్‌ ఫస్ట్ మూవీ ఎలా ఆగిపోయిందో తెలుసా? రెండు సార్లు చేదు అనుభవం