రామ్ చరణ్ కు హాలీవుడ్ నుంచి పిలుపు, ఫస్ట్ ఇండియాన్ హీరోగా మెగా పవర్ స్టార్ రికార్డ్..?

By Mahesh JujjuriFirst Published Jul 21, 2024, 2:15 PM IST
Highlights

ఫ్యాన్స్ ను వరుసగా సర్ ప్రైజ్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.  జాతీయ .. అంతర్జాతీయ స్థాయిలో గౌరవాలు అందుకుంటున్నాడు. తాజాగా చరణ్ ఖాతాలో.. మరో అరుదైన గౌరవం వచ్చి చేరింది. 
 

ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. వరుసగా ఏదో ఒక ప్రత్యేక గౌరవం అందుకుంటూ సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా మరో గౌరవం అందుకోబోతున్నాడు రామ్ చరణ్. రీసెంట్ గా మేడమ్ టుస్సాడ్స్ మ్యుజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నన్యూస్ వైరల్ అవుతుండగా.. రామ్ చరణ్ మరో అవార్డ్ ను హాలీవుడ్ నుంచి అందుకోబోతున్నాడు.  

ది ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్(ఐఎఫ్ఎఫ్ఎం) 15 ఎడిష‌న్‌కు గెస్ట్ ఆఫ్ హాన‌ర్ అవార్డును గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అందుకోనున్నారు. మెల్‌బోర్న్‌లో జ‌ర‌గ‌నున్న ఈ ఇండియ‌న్ మూవీ అవార్డుల‌కు రామ్ చ‌ర‌ణ్ సెలక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇండియన్ సినిమాలో భారీ విజయాలు అందుకోవడంతో పాటు.. అద్భుతమైన ప్రతిభ కనబరిచి హాలీవుడ్ స్టార్ దర్శకుల చేత శభాష్ అనిపించుకున్నారు చరణ్. 

Latest Videos

ఇక తాజా రామ్ చరణ్ అందుకోబోతున్న  IFFM అవార్డ్ విషయానికి వస్తే.. ఇది  ఆస్ట్రేలియాలోని విక్టోరియన్ రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే అధికారిక చలనచిత్రోత్సవం. ఈ వేడుక‌లు 15 నుంచి 25 వరకూ.. ఆగస్టు నెలలో జరుగుతాయి. ఈ ఏడాది కూడా వాటికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా

ఈ IFFM వేడుక‌ల్లో రామ్ చరణ్ హానర్ గెస్ట్ గా ఉండబోతున్నాడు. అంతే కాదు  ఇండియ‌న్ సినిమాకు ఆయ‌న చేసిన సేవ‌కుగానూ ఇండియ‌న్ ఆర్ట్ అండ్ కల్చ‌ర్ అంబాసిడర్‌గా రామ్ చరణ్ ను ప్రనకటించబోతున్నారు. ఇటు రామ్ చరణ్ కూడా ఈ విషయంలో స్పందించారు.  మ‌న భార‌తీయ చిత్రాల్లోని వైవిధ్యాన్ని, గొప్ప‌దనాన్ని ఇలాంటి ఓ అంత‌ర్జాతీయ వేదిక‌గా ఘ‌నంగా నిర్వ‌హిస్తుండ‌టం ఆనందంగా ఉంది అన్నారు.  ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో భాగం కావ‌టం నాకు దక్కిన అతి పెద్ద గౌర‌వంగా భావిస్తున్నాను అన్నారు చరణ్. 

అంతే కాదు మన సినిమాల తరపున ఇంత పెద్ద వేదికపై నేను ప్రాతినిధ్యం వహించడం.. మాటల్లో చెప్పలేని సంతోషాన్ని ఇస్తోంది. మెల్‌బోర్న్‌లో మ‌న జాతీయ జెండాను ఎగుర‌వేసే అద్భుత‌మైన అవ‌కాశం కోసం నేను ఎదురు చూస్తున్నాను అన్నారు రామ్ చరణ్. తనకు ఇంత గౌరవం దక్కడానికి కారణం ట్రిపుల్ ఆర్ చేయడంమే అని అన్నారు చరణ్. 
  

click me!