ఆర్‌. నారాయణ మూర్తి హెల్త్ అప్డేట్,డాక్టర్స్ ఏమన్నారు

Published : Jul 21, 2024, 06:31 AM IST
ఆర్‌. నారాయణ మూర్తి హెల్త్ అప్డేట్,డాక్టర్స్ ఏమన్నారు

సారాంశం

నాలుగు  రోజుల పాటు హాస్పిటల్ కే పరిమితమైన నారాయణ మూర్తి  బయటకొచ్చారు. 


 'పీపుల్ స్టార్' ఆర్. నారాయణ మూర్తి అస్వస్థతకు గురయ్యిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.  అలాగే ఆయనకు కొన్నేళ్ల కిందట బైపాస్ సర్జరీ జరిగింది. ఆయన బుధవారం (జులై 17) హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. నారాయణ మూర్తి ఉన్నట్లుండి ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.  పలువురు సినీ ప్రముఖులు కూడా పీపుల్ స్టార్ ఆరోగ్యంపై ఆరా తీసారు. 

17వ తేదీన ప్రసాద్ ల్యాబ్స్ లో పెట్టిన ఓ ప్రెస్ మీట్ లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఆర్.నారాయణ మూర్తి. వెంటనే ఆయన్ను నిమ్స్ లో జాయిన్ చేశారు. వైద్యులు ఆయనకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి ప్రమాదం లేదని అప్పుడే ప్రకటించారు.అయినప్పటికీ  ఎందుకైనా మంచిదని నిమ్స్ లోనే  డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంచారు. అలా నాలుగు  రోజుల పాటు హాస్పిటల్ కే పరిమితమైన నారాయణ మూర్తి  బయటకొచ్చారు. నారాయణ మూర్తి పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ కావడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. డాక్టర్స్...రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలని, ప్రస్తుతానికి ఏ సమస్యా లేదని చెప్పినట్లు సమాచారం. 

నిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఆర్ నారాయణ మూర్తి మీడియాతో మాట్లాడారు. దేవుడి దయ వల్ల తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని అన్నారు. తనకు చికిత్స అందించిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బిరప్పతో పాటు అక్కడి వైద్యులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. తన క్షేమాన్ని కోరుకున్న ప్రజా దేవుళ్లకు శిరస్సు వంచి దండం పెడుతున్నాని ఆయన చెప్పారు.

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి