ఆ సెక్షన్స్ క్రింద శ్రీరెడ్డిపై పోలీస్ కేసు, ఇక్కడితో ఆగదా?

By Surya PrakashFirst Published Jul 21, 2024, 6:06 AM IST
Highlights

త్వరలోనే శ్రీరెడ్డిని విచారణకు పిలిచేందుకు.. ఆ తర్వాత అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఎన్నిక‌లు, రిజ‌ల్ట్ త‌ర‌వాత   శ్రీ‌రెడ్డి పెద్దగా నోరు విప్పటం లేదు. అలాగే ఆమె వీడియోలు కూడా పెద్దగా కనిపించటం లేదు. ఎక్కువగా అండ‌ర్ గ్రౌండ్ లోనే ఉంటోంది బయిటకు రావటం లేదని అంటున్నారు. అయితే ఎలక్షన్స్ తర్వాత ఇలాగే జరుగుతుందని చాలా మంది  భావించారు. ఆమెకు ఇబ్బందులు ఉంటాయి. పోలీస్ కేసులు ఉంటాయని అంచనా వేసారు. అదే మొదలైంది.   

సినీ నటి, యూట్యూబర్‌ శ్రీరెడ్డిపై కర్నూలు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితలపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన ఈ కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకున్న కర్నూలు టీడీపీ బీసీ సెల్ నాయకుడు రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కర్నూలు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు.త్వరలోనే శ్రీరెడ్డిని విచారణకు పిలిచేందుకు.. ఆ తర్వాత అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Latest Videos

ఈ నేపధ్యంలో సోషల్ మీడియా వేదికగా సభ్య సమాజం తలదించుకునే విధంగా శ్రీరెడ్డి తమ నేతలను దూషిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. శ్రీరెడ్డి మీద చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీరెడ్డి మీద సెక్షన్ 352,353, బిఎన్ఎస్,66 ఐటిఏ ,2000-2008 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది. మరోవైపు శ్రీ రెడ్డి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.  టీడీపీ నేతలపై మితిమీరి వ్యాఖ్యలు చేస్తున్నారనేది తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆరోపణ. 

సోషల్ మీడియాలో  ఇలా రాజకీయ నేతలు, వారి కుటుంబసభ్యులను కించపరిచేలా మాట్లాడటం సరికాదని టీడీపీ నేతలు ఆరోపించారు. శ్రీరెడ్డి లాంటి విషపు ఆలోచనలు ఉన్నవారు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారన్న టీడీపీ నేత రాజు యాదవ్.. ఇతరులు కూడా ఆమెను ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉందన్నారు. అలా జరగకముందే ఇలాంటి వారిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని రాజు యాదవ్ కోరారు. 
 
అలాగే ఎన్నికలకు ముందు, తర్వాత ఆమె సోషల్‌ మీడియా వేదికగా పలు సందర్భాల్లో వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని వివరించారు. ఈ నేపథ్యంలో ఆయా అంశాలకు సంబంధించిన సోషల్‌ మీడియా క్లిప్పింగులు, వీడియోలతో పాటు పలు ఆధారాలను పోలీసులకు సమర్పించారు. దీంతో శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మురళీధర్‌ రెడ్డి తెలిపారు. అయితే శ్రీరెడ్డి మీద చాలా చోట్ల ఇలాంటి కేసులు పడతాయని, తప్పించుకోవటం కష్టమని సోషల్ మీడియాలో పోస్ట్ లు పడుతున్నాయి. ఇలా ఎలక్షన్స్ కు ముందు రెచ్చిపోయి మాట్లాడిన వారందరినీ ఊచలు లెక్కపెట్టేలా చేస్తామంటున్నారు. 

click me!