
సూపర్ స్టార్ మహేష్(Mahesh) కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రం `పోకిరి`(Pokiri). మహేష్‌కి తిరుగులేని మాస్ ఇమేజ్‌ని తీసుకొచ్చిన సినిమా ఇది. పూరీ జగన్నాథ్(Puri Jagannadh), మహేష్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం 16ఏళ్ల క్రితం విడుదలై సంచలనం సృష్టించింది. 2006, ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. అప్పటి వరకు ఎక్కువ రోజులు ఆడితే హిట్‌గా పరిగణించే సినీ వర్గాలకు కలెక్షన్ల టేస్ట్ ఏంటో చూపించింది `పోకిరి`. మహేష్ స్టయిల్, యాక్షన్, పూరీ డేరింగ్ టేకింగ్ సినిమాని బ్లాక్ బస్టర్‌గా మలిచాయి.
ఇందులో గోవా బ్యూటీ ఇలియానా(Ileana) అందాలు స్పెషల్ ఎట్రాక్షన్. ఆమె తన నడుముతో తెలుగు కుర్రాళ్లని ఫిదా చేసింది. స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్‌నే తన వెంట తిప్పుకుంది. ఇక ఈ చిత్రంలో క్లైమాక్స్ హైలైట్‌గా నిలుస్తుంది. అదే సినిమాకి ప్రాణం. ఆ క్లైమాక్స్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ హైలైట్‌గా నిలవడం విశేషం. పండుగాడుగా మహేష్ చేసిన రచ్చ మామూలు కాదు. వెండితెరని ఓ రేంజ్ లో ఆడుకున్నారు. బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిపించారు. 40కోట్ల షేర్‌ని, 70కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసిందీ చిత్రం. అప్పటి వరకు ఇదే హైయ్యేస్ట్ కలెక్షన్లు కావడం విశేషం.
ఇదిలా ఉంటే ఈ చిత్రం మళ్లీ తెరపైకి రాబోతుంది. మహేష్ ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్ చేయబోతుంది యూనిట్. సినిమాని మళ్లీ థియేటర్లో విడుదల చేయబోతున్నారు. ఆగస్ట్ 9న మహేష్‌బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా `పోకిరి`ని వరల్డ్ వైడ్‌గా కొన్ని థియేటర్లలో ప్రత్యేక షోస్ వేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమాలోని బెస్ట్ లుక్‌ని విడుదల చేశారు. క్లైమాక్స్ లో మహేష్ పరిగెత్తుకుంటూ వస్తోన్న లుక్ ని రిలీజ్ చేయగా, అది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ కి మరోసారి పూనకాలు తెప్పిస్తుండటం విశేషం.
ఇక `పోకిరి` చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్ అయ్యింది. అక్కడ కూడా విజయాలు సాధించింది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ముందుగా మహేష్‌కి బదులు రవితేజని అనుకున్నారట పూరీ. `ఉత్తమ్ సింగ్.. సన్నాఫ్ సూర్య నారాయణ` అనే టైటిల్ కూడా అనుకున్నారట. కానీ రవితేజ్‌తో సెట్ కాలేదు. దీంతో మహేష్ వద్దకి వెళ్లింది. అయితే ఇలియానాకి బదులు `సూపర్`లో నటించి అయేషా టకియాని అనుకున్నారట. కుదరకపోవడంతో కంగనా రనౌత్ పేరు వినిపించింది, అది కూడా సెట్ కాకపోవడంతో ఇలియానాని తీసుకున్నారు. ఈ చిత్రం అందరి లైఫ్‌లను మార్చేసిన విషయం తెలిసిందే.