పవన్ కోసం చరణ్.. సోషల్ మీడియా ప్రచారం!

Published : Apr 04, 2019, 01:37 PM IST
పవన్ కోసం చరణ్.. సోషల్ మీడియా ప్రచారం!

సారాంశం

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో జనసేనకి మద్దతుగా పోస్ట్ లు పెడుతూ ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. 

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో జనసేనకి మద్దతుగా పోస్ట్ లు పెడుతూ ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పవన్ 'జనసేన' పార్టీ తరఫున ప్రచారం హోరేత్తించాడు.

సినిమా ఇండస్ట్రీలో ఆయన అభిమానులు కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ.. తమ మద్దతు ప్రకటిస్తున్నారు. మెగా కుటుంబం నుండి నాగబాబు లోక్ సభ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో నీహారిక తప్ప మెగాఫ్యామిలీ నుండి ఏ ఒక్కరూ కూడా వచ్చి ప్రచారం చేయలేదు.

చిరంజీవి జనసేనకి మద్దతుగా ఏ ఒక్కరూ ప్రచారం నిర్వహించడానికి వీళ్లేదని కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. అది నిజమే అన్నట్లు మెగాఫ్యామిలీ నుండి ఏ ఒక్కరూ కూడా ప్రచారంలో పాల్గొనలేదు. తాజాగా జనసేనకి మద్దతుగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి అభిమానులను ఆకట్టుకున్నాడు.

''అధ్బుతమైన మేనిఫెస్టో.. సమాజంలోని అన్ని విభాగాలకు సమ న్యాయం చేస్తోంది. రాజకీయాల్లో ఇదొక సరికొత్త పంథా. కళ్యాణ్ బాబాయ్ కి కంగ్రాట్స్. అలాగే జనసేన పార్టీ అభ్యర్ధులందరికీ ఆల్ ది బెస్ట్'' అంటూ పోస్ట్ పెట్టాడు. ఓట్ ఫర్ గ్లాస్, జనసేన రివల్యూషన్ 2019 అంటూ హ్యాష్ ట్యాగ్స్ జత చేశాడు.   

PREV
click me!

Recommended Stories

థాంక్యూ మై దోస్త్.. మహేష్ బాబు కు ప్రియాంక చోప్రా ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకో తెలుసా?
రామ్ చరణ్ పెద్ది కోసం మృణాల్ ఠాకూర్ ఐటమ్ సాంగ్..? రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందో తెలుసా?