చిరంజీవికి ఆ ఆలోచనే లేదు.. అవన్నీ రూమర్సే

Published : Apr 04, 2019, 12:43 PM IST
చిరంజీవికి ఆ ఆలోచనే లేదు.. అవన్నీ రూమర్సే

సారాంశం

చిరంజీవి త్వరలో తన కోడలు ఉపాసన బాబాయ్ అయిన కాంగ్రేస్ ఎంపి క్యాండిడేట్ కొండా విశ్వేశ్వర రెడ్డి తరుపున క్యాంపైన్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 

చిరంజీవి త్వరలో తన కోడలు ఉపాసన బాబాయ్ అయిన కాంగ్రేస్ ఎంపి క్యాండిడేట్ కొండా విశ్వేశ్వర రెడ్డి తరుపున క్యాంపైన్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  ఆయన తెలంగాణాలోని చేవెళ్ల నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అన్ని పెద్ద మీడియా సంస్దలు ఈ వార్తను కవర్ చేసాయి. అయితే అందుతున్న సమాచారం మేరకు చిరంజీవి ఎక్కడా ఎవరికోసం ప్రచారం చేయటానికి వెళ్లటం లేదు. 

చిరంజీవి సన్నిహితల నుంచి తెలుస్తున్న విషయం ప్రకారం..చిరంజీవి కేవలం తన దృష్టిని సైరా నరసింహా రెడ్డి చిత్రంపైనే పెట్టారు. చివరకు తన సోదరుడు పవన్ కళ్యాణ్ .. జనసేన పార్టీ ప్రచారంలో కూడా పాల్గొనటం లేదు. అయితే ఆయన్ని ప్రచారానికి రమ్మనమని అడిగింది మాత్రం నిజం. అయితే తాను సినిమా పనుల్లో పూర్తి బిజిగా ఉన్నానని, రాలేనని సున్నితంగా చెప్పారట. 

ఇక కొంతకాలంగా ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాతో బిజీ బిజీగా ఉన్న చిరంజీవి కాస్త బ్రేక్  కోసం తన సతీమణి సురేఖతో కలిసి జపాన్‌ రాజధాని టోక్యో వెళ్లారు  చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత ఈ విషయాలను ఖరారు చేస్తూ ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మాతగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘సైరా: నరసింహారెడ్డి’ షూటింగ్ చివరి  దశకు చేరుకుంది. దసరాకు విడుదల చేయాలనకుంటున్నారట. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తారు.

PREV
click me!

Recommended Stories

Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే
Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది