రామ్ చరణ్ పై ఈ న్యూస్ నమ్మచ్చా? ధైర్యం చేస్తాడా

Surya Prakash   | Asianet News
Published : Oct 10, 2020, 11:32 AM IST
రామ్ చరణ్ పై ఈ న్యూస్ నమ్మచ్చా? ధైర్యం చేస్తాడా

సారాంశం

రామ్ చరణ్ కెరీర్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. అందుకు తన తండ్రి చిరంజీవి సూచనలు, సలహాలు ఉండనే ఉన్నాయి. ఏ సినిమా పడితే ఆ సినిమా ఓకే చేసే పరిస్దితుల్లో లేడు.  డబ్బు కన్నా తన డేట్స్ ఎంతో విలువైనవిగా భావిస్తున్నాడు. 


రామ్ చరణ్ కెరీర్ లో మంచి పీక్స్ కు వెళ్తున్న  సమయం ఇది. ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. అందుకు తన తండ్రి చిరంజీవి సూచనలు, సలహాలు ఉండనే ఉన్నాయి. ఏ సినిమా పడితే ఆ సినిమా ఓకే చేసే పరిస్దితుల్లో లేడు.  డబ్బు కన్నా తన డేట్స్ ఎంతో విలువైనవిగా భావిస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో  రామ్ చరణ్ ...ప్రముఖ సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా ఓకే చేసారని వార్తలు వస్తున్నాయి. అందులో ఎంతవరకూ నిజం అనేది ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరా దర్శకుడు ..ఏమా కథ అంటే..
 
ఫ్యామిలీ స్టోరీ అయినా.. భక్తిరస ప్రధాన చిత్రమైనా.. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా
సినిమాలు తెరకెక్కించే  ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’,
‘ఘరానా మొగుడు’ చిత్రాలతో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి కి మంచి  సక్సెస్ లను అందించారు. ఆయన  త్వరలో  రామ్‌ చరణ్‌తో ఓ సినిమా చేయనున్నట్లు అంతటా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు
సోషల్‌మీడియా వేదికగా పలు పోస్టులు  కనపడుతున్నాయి. 

చెర్రీ 14వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు  నెటిజన్లు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా పాన్‌ ఇండియన్‌ స్థాయి మూవీగా ఈ సినిమా ఉండనుందంటూ  వరుస ట్వీట్లు చేస్తున్నారు. దీంతో రాఘవేంద్రరావు - చరణ్‌ కాంబినేషన్‌ గురించి ప్రస్తుతం నెట్టింట్లో పెద్ద చర్చగా మారింది. అయితే ఇందులో నిజమెంత  ఉంది. ఇప్పుడున్న పరిస్దితుల్లో రామ్ చరణ్ ..రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా చేస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. 

సీనియర్ గా తన తండ్రికు సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడుగా ఆయనపై గౌరవం ఉండవచ్చు కానీ తన డేట్స్ ఇచ్చే ధైర్యం చేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. కాకపోతే ఆయన ఇప్పుడు తలపెట్టిన మరో సినిమా పెళ్లి సందడి కనుక హిట్ అయితే మాత్రం  ...ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాసం ఉంటుంది. 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌