2.70 కోట్లు మోసపోయిన స్టార్ కమెడియన్‌ , కేసులో హీరో తండ్రి కూడా...

By Surya PrakashFirst Published Oct 10, 2020, 11:01 AM IST
Highlights

భూములు కొనిస్తా మంటూ సూరిని నమ్మించి తమ చిత్రంలో నటించినందుకు ఇవ్వాల్సిన రెమ్యునేషన్ ని  కూడా ఆ నిర్మాతలు నాకేసారు.  కొంతకాలానికి తాను మోసపోయానని రియలైజ్ అయిన సూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ నిర్మాతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 

ప్రముఖ తమిళ కమిడయన్  పరోటాసూరిని ఇద్దరు సినీ నిర్మాతలు మాయ మాటలు చెప్పి రూ.2.70కోట్లు  మోసగించారు. భూములు కొనిస్తా మంటూ సూరిని నమ్మించి తమ చిత్రంలో నటించినందుకు ఇవ్వాల్సిన రెమ్యునేషన్ ని  కూడా ఆ నిర్మాతలు నాకేసారు.  కొంతకాలానికి తాను మోసపోయానని రియలైజ్ అయిన సూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ నిర్మాతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

వివరాల్లోకి వెళితే..అడయార్‌ ప్రాంతానికి చెందిన రమేష్‌, అన్బువేల్‌రాజన్‌ కలిసి ‘వీరధీర సూరన్‌’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రంలో సూరి నటించినం దుకు రూ.4 లక్షల పారితోషికం ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ పారితోషికంతో మరికొంత ధనం సమకూర్చిస్తే సిరుచేరిలో భూములు కొని రిజిస్టర్‌ చేయిస్తామని సూరికి ఇద్దరు నిర్మాతలు తెలిపారు. వారి మాటలను నమ్మిన సూరి వాయిదాల పద్ధతిలో రూ.2.15కోట్ల వరకు చెల్లించారు. 

ఆ తర్వాత ఆ నిర్మాతలు చూపించిన భూములను సూరి పరిశీలించి నప్పుడు వాటికి  రోడ్డు సదుపాయం లేదని, పట్టా లేదని గుర్తించారు. దీంతో తానిచ్చిన నగదు తిరిగివ్వ మని నిర్మాతలను కోరాడు. ఆ మేరకు మొత్తం సొమ్మును తిరిగిచ్చేలా నిర్మాతలు 2018లో ఎగ్రిమెంట్ రాసి సూరికి ఇచ్చారు. అయితే  నిర్మాతలిద్దరూ ఆయనకు సొమ్ము చెల్లించలేదు. దీంతో సూరి అడ యార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూములు కొనిస్తామని చెప్పి తన వద్ద రూ.2.70 కోట్ల వరకు వసూలు చేసి మోసగిం చారని ఫిర్యాదులో పేర్కొ న్నారు. అడయార్‌ పోలీసులు ఆ నిర్మాతలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

మరో ప్రక్క ఈ కేసులో హీరో విష్ణు విశాల్‌ తండ్రి కూడా ఉన్నారని సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై హీరో విష్ణు విశాల్‌ స్పందించారు. "ఇలాంటి తప్పుడు వార్తలెలా వస్తాయో అర్థం కావడం లేదు. మా విశాల్‌ స్టూడియోస్‌ నుండి సూరికి 2017లో ఓ సినిమా కోసం ఇచ్చిన అడ్వాన్స్‌ కూడా ఆయన తిరిగి ఇవ్వలేదు. మాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. ఈ సమయంలో ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని అనుకుంటున్నాను" అన్నారు విష్ణు విశాల్‌. 
 

click me!