కరోనా పాజిటివ్‌: వెంటిలేటర్‌పై ప్రముఖ నటుడు

Surya Prakash   | Asianet News
Published : Oct 10, 2020, 10:55 AM IST
కరోనా పాజిటివ్‌: వెంటిలేటర్‌పై ప్రముఖ నటుడు

సారాంశం

ఇటీవల కేంద్రం షూటింగ్‌లకు అనుమతివ్వడంతో ఆయన దర్శకత్వం వహిస్తున్న అభియాన్‌ షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన కరోనా బారిన ఉంటారని కుటుంబ సభ్యులు అభిప్రాయ పడుతున్నారు. 

కరోనా వైరస్  సోకిన ప్రముఖ బెంగాల్  సినీనటుడు సౌమిత్రా ఛటర్జీ ఆరోగ్యం విషమించడంతో ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సౌమిత్రా ఛటర్జీకి ఈ నెల 6వతేదీన కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో హోం క్వారంటైన్ లో ఉన్న ఛటర్జీ ఆరోగ్యం  నిన్న శుక్రవారం విషమించింది. దాంతో ఆయనను డాక్టర్లు  వెంటిలేటర్‌పై ఉంచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతి క్షణం వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నట్లు కూడా చెప్పారు.

 అయితే గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు కోవిడ్‌ పరీక్షలు చేయించాల్సిందిగా వైద్యులు సూచించారు. కోవిడ్‌ పరీక్షలు చేయించగా ఆయనకు పాజిటివ్‌ వచ్చినట్లు అక్టోబర్‌ 6న డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు కోల్‌కతాలోని బెల్లెవ్‌ నర్సింగ్‌ హోంకు తరలించారు.
 
రీసెంట్ గా  కేంద్రం షూటింగ్‌లకు అనుమతివ్వడంతో ఆయన దర్శకత్తం వహిస్తున్న అభియాన్‌ షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన కరోనా బారిన ఉంటారని కుటుంబ సభ్యులు అభిప్రాయ పడుతున్నారు. 

ఇక సౌమిత్రా ఆస్కార్‌ విజేత సత్యజిత్‌ రే...ఫెలుడా రచనలలో కూడా ఒక భాగం. ఆయన  రచనలైన ది వరల్డ్​ ఆఫ్‌ అపు, సంఘర్ష్‌లు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అంతేగాక స్వయంగా ఆయన రాసిన అషాని సంకేట్‌, ఘరే బైర్‌, అరణ్య దిన్‌ రాత్రి, ,చారులత, షాఖా ప్రోశాఖా, జిందర్‌ బండి, సాత్‌ పాక్‌ బంధతో పాటు మరిన్ని రచనలు ఉత్తమంగా నిలిచాయి.

PREV
click me!

Recommended Stories

20 ఏళ్లుగా స్టార్ డమ్ కోసం ఎదురుచూసి.. తెలుగులో కనిపించకుండా పోయిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Bigg Boss 9 Telugu: షాకింగ్ ట్విస్ట్... ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ విన్నర్ రేసులోకి..