మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పీడ్ మామూలుగా లేదు. సినిమాల మీద సినిమాలు వరుసగా ప్లాన్ చేసుకుంటున్నాడు చరణ్. ట్రిపుల్ ఆర్ కు బ్రేక్ రావడంతో.. తన నెక్ట్స్ సినిమాల పై ఫోకస్ పెట్టాడు చరణ్.
ట్రిపుల్ ఆర్ దెబ్బతో షాక్ లో ఉన్నారు రామ్ చరణ్(Ram Charan). సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో... తన నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు చరణ్. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్లు కూడా దాదాపు కంప్లీట్ అయ్యాయి. మరోసారి రిలీజ్ డేట్ వస్తే.. ఈసారి అంత ఉదృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి.. నెక్ట్స్ సినిమాలు లైన్ అప్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఫ్యాన్స్ తో రెండేళ్లకు పైగా గ్యాప్ వచ్చింది. 2019 లో వినయ విధేయ రామా తరువాత చరణ్ నుంచి సినిమా లేదు.
వినయ విధేయ రామా కూడా ప్లాప్ అవ్వడంతో.. మెగా హీరో నుంచి సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు ప్యాన్స్. ట్రిపుల్ ఆర్(RRR) వచ్చి.. ఫ్యాన్స్ ను మురిపిస్తుంది అనుకుంటే.. అది కాస్తా.. కోవిడ్ దెబ్బకుఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. అందుకే.. ఇక లేట్ చేయకుండా.. నెక్ట్స్ సినిమాలకు జంప్ వుతున్నాడు రామ్ చరణ్. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తో పాన్ ఇండియా మూవీ.. రెండు షెడ్యుల్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ రావడంతో.. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ను కూడా సెట్స్ ఎక్కించాడు చరణ్(Ram Charan). త్వరలో ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది.
ఇక ఈసినిమాలు కాకుండా మరో క్రేజీ డైరేక్టర్ తో రామ్ చరణ్(Ram Charan) సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా నానీతో శ్యామ్ సింగరాయ్ హిట్ కొట్టిన రాహుల్ సంక్రుత్యన్ తో.. చరణ్ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. శ్యామ్ సింగరాయ్ చూసిన మెగా పవర్ స్టార్.. చాలా ఇంప్రెస్ అయ్యారట. రాహుల్ మేకింగ్ నచ్చడంతో.. ఆయనకు సినమా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. మంచి కథతో తన దగ్గరకు రావాలంటూ.. రామ్ చరణ్(Ram Charan) స్వయంగా రాహుల్ కు కబురు పెట్టినట్టు సమాచారం.
ఇది నిజం అయితే మాత్రం రాహుల్ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే. విజయ్ దేవరకొండ హీరోగా.. టాక్సీవాల సినిమాతో డైరెక్టర్ గా మారిన రాహుల్, సెకండ్ మూవీతోనే నేచురల్ స్టార్ నానిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఇక మూడో సినిమాగా మెగా హీరోను డైరెక్ట్ చేసే బంపర్ ఆఫర్ వచ్చింది కుర్ర డైరెక్టర్ కి . ఈ ఇమేజ్ ఇలాగే క్యారీ చేస్తాడా.. హిట్ కొట్టి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల పక్కన ప్లేస్ సాధిస్తాడా చూడాలి.
Also Read:NTR New Movie : ఎన్టీఆర్ సినిమాలో హీరో రాజశేఖర్.. ఏ పాత్ర చేయబోతున్నాడంటే..?
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan)ట్రిపుల్ ఆర్(RRR) తో పాటు , మెగాస్టార్ చిరంజీవితో కలిసి.. ఆచార్య సినిమా చేశారు. ఈ రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఆచార్యను పిబ్రవరి 4న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.అప్పటి వరకూ కరోనా ఇబ్బంది లేకుంటే.. సినిమా రిలీజ్ అవుతుంది. లేకుంటే ఆచార్య కూడ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆచార్య ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేయలేదు టీమ్.
Also Read:నానికి క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్.. `శ్యామ్ సింగరాయ్` గురించి ఏమన్నాడంటే?