`వకీల్‌ సాబ్‌`ని కలిసిన అల్లూరి సీతారామరాజు.. ఏంటి విశేషం?

Published : Jan 16, 2021, 03:19 PM IST
`వకీల్‌ సాబ్‌`ని కలిసిన అల్లూరి సీతారామరాజు.. ఏంటి విశేషం?

సారాంశం

సంక్రాంతి పండుగని పురస్కరించుకుని రామ్‌చరణ్‌..పవన్‌ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కరోనా ప్రభావం, ఇటీవల చరణ్‌కి కరోనా సోకడం వంటి కారణంగా చాలా రోజులుగా వీరు కలుసుకోలేదు. పైగా పండుగల సమయంలో వీరు కలుసుకునే సాంప్రదాయం ఉంది. దీనికితోడు పవన్‌కి, చెర్రీకి మధ్య మరింత అనుబంధం ఉంది. 

ప్రస్తుతం `వకీల్‌సాబ్‌` ఎవరు అంటూ పవన్‌ కళ్యాణ్‌ పేరు గుర్తొస్తుంది. ఆయన `వకీల్‌సాబ్‌` చిత్రంలో నటించడం, పైగా అందులో ఆయన లాయర్‌ గెటప్‌లో కనిపించడంతో ప్రస్తుతానికి వకీల్‌సాబ్‌ గా మారిపోయారు పవన్‌. ఇక అలాగే రామ్‌చరణ్‌..`అల్లూరి సీతారామరాజు`గా మారిపోయారు. ఆయన `ఆర్‌ ఆర్‌ఆర్‌` చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. బాబాయ్‌ పవన్‌, అబ్బాయి చరణ్‌ కలిశారు. 

సంక్రాంతి పండుగని పురస్కరించుకుని రామ్‌చరణ్‌..పవన్‌ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కరోనా ప్రభావం, ఇటీవల చరణ్‌కి కరోనా సోకడం వంటి కారణంగా చాలా రోజులుగా వీరు కలుసుకోలేదు. పైగా పండుగల సమయంలో వీరు కలుసుకునే సాంప్రదాయం ఉంది. దీనికితోడు పవన్‌కి, చెర్రీకి మధ్య మరింత అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో స్వయంగా చెర్రీ పవన్‌ ఇంటికి వెళ్లి తన శుభాకాంక్షలు తెలియజేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంది. మరి జనరల్‌ విషెస్‌ తెలియజేయడం కోసమే వెళ్లాడా? అంతకు మించి ఇంకేదైనా విశేషం ఉందా? అనేది ఆసక్తి నెలకొంది.

 దీంతో పవన్‌ అభిమానులు, చెర్రీ అభిమానులు, మొత్తంగా మెగా అభిమానులు ఫుల్‌ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ ఇంట సంక్రాంతి సంబరాల్లో నాగార్జున సందడి చేశారు. చిరంజీవి, రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌, సాయితేజ్‌ ఇలా మెగా హీరోలు పాల్గొనగా, వారితోపాటు నాగార్జున కూడా కనిపించారు.ఈ  ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్