‘అల్లుడు అదుర్స్’తో సంక్రాంతికి అలరించేందుకు వచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిందీ చిత్రం. నభానటేశ్, అను ఇమాన్యుయెల్ హీరోయిన్స్. ప్రకాశ్‌రాజ్, సోనూసూద్ కీలకపాత్రల్లో కనిపించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మాత.
హిట్ కోసం ఎంతో డెస్పరేట్ గా ఎదురు చూస్తున్నారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. కెరీర్ ఆరంభంలో ‘అల్లుడు శీను’తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అతను ఆ తర్వాత ‘స్పీడునోడు’, ‘సాక్ష్యం’, ‘కవచం’ సినిమాలతో అనుకున్న స్థాయి సక్సెస్ లను అందుకోలేకపోయారు. రీసెంట్ గా వచ్చిన ‘రాక్షసుడు’తో హిట్ కొట్టినా అది రీమేక్ ఖాతాలోకి వెల్లిపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘సీత’ డిజాస్టర్ అయ్యింది. దీంతో ఆయన.. తనకి కలిసి వచ్చిన ‘అల్లుడు’ అనే టైటిల్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. ‘అల్లుడు అదుర్స్’అంటూ సంక్రాంతి బరిలోకి దిగిన బెల్లంకొండ శ్రీనివాస్‌కు సెంటిమెంట్ వర్కౌట్ అయ్యిందా? అంటే లేదనే చెప్పాలి.
ఈ సినిమాని రామ్ ..రెడ్ రోజునే విడుదల చేసారు. రెడ్ సినిమా కూడా భాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ టాక్ తెచ్చుకోలేదు. అయితే అల్లుడు మాత్రం మరీ డిజాస్టర్ అయ్యిపోయాడు. మినిమం వసూళ్లు కూడా రావటం కష్టమేనని అంటున్నారు. బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాసం లేదని తేల్చి చెప్తున్నారు ట్రేడ్ లో . సంక్రాంతి రిలీజ్ ల్లో మరీ ఎక్కువ బ్యాడ్ టాక్ తెచ్చుకున్నది ఈ సినిమానే కావటం చెప్పుకోదగ్గ విషయం. రెడ్ సినిమాకు టాక్, రివ్యూలు గొప్పగా లేకపోయినా ఉన్నంతలో కలెక్షన్స్ బాగున్నాయి. పండగ రెండు రోజులూ బాగానే నడిచింది. అల్లుడు అదుర్స్ మాత్రం ఫస్ట్ రోజు డీసెంట్ కలెక్షన్స్ వచ్చినా రెండో రోజుకే తేలిపోయింది.ఈ సినిమాని భరించటం కష్టమని తేల్చేసారు ప్రేక్షకులు.
వాస్తవానికి ట్రైలర్ చూసి ఏదో కామడీ సినిమా అని, ‘అల్లుడు అదుర్స్’లో ఏదో కొత్తగా చూపిస్తారని చాలామంది థియేటర్లకు వచ్చారు. డైలాగుల నుంచి ఫైట్ల వరకు, యాక్టింగ్ నుంచి ట్విస్టుల వరకు ఏవీ కొత్తగా లేకపోతే ఆ సినిమా నుంచి ఒక్కసారిగా డ్రాప్ అయ్యిపోయింది. ఇంటర్వెల్ వరకు నాలుగు లవ్ సీన్లు, మూడు కామెడీ బిట్లతో అలా అలా సాగిపోయింది. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి... మరి మూస ధోరణికి వెళ్లి బోర్ కొట్టిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా అయితే మరీ దారుణం.