
మొన్న అఖండ.. నేడు పుష్ప.. సినిమాలు చూసేందుకు జనాలు థియేటర్స్ కి ఎగబడుతుండడం టాలీవుడ్ దర్శక నిర్మాతల్లో జోష్ నింపే అంశమే. ఇదిలా ఉండగా యావత్ దేశం మొత్తం రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. రాంచరణ్, ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్స్ కలసి నటించడంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
రాంచరణ్ ఎన్టీఆర్ సాహసాలు, యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్స్ ప్రతి ఒక్కటి కళ్ళు చెదిరేలా ఉన్నాయి. దీనితో ఈ చిత్రం థియేటర్స్ లోకి ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి కూడా ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రచార కార్యక్రమాల జోరు పెంచుతున్నాడు. డిసెంబర్ 19న ముంబై వేదికగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ ఈవెంట్ కు కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈవెంట్ లో ఎన్టీఆర్, రాంచరణ్, అలియా భట్ ఎలాగూ ఉంటారు. ఈ ఈవెంట్ కి రెండు రోజుల ముందే మెగా పవర్ స్టార్ రాంచరణ్ ముంబైలో వాలిపోయాడు. చరణ్ ముంబైకి వెళ్లిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాంచరణ్ అల్ట్రా స్టైలిష్ లుక్ దర్శనం ఇస్తున్న పిక్స్ ఫ్యాన్స్ కు క్రేజీగా మారాయి. చరణ్, ఎన్టీఆర్ ముంబై మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతా రామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు. బ్రిటిష్ ప్రభుత్వంలో పోలీస్ అధికారిగా ఉన్న రాంచరణ్ అల్లూరిగా ఎలా మారాడు.. గొండ్ల జాతికి కాపరిగా ఉన్న ఎన్టీఆర్ బ్రిటిష్ వారిపై ఎలా తిరగబడ్డాడు అనే అంశాలని రాజమౌళి కల్పిత గాధగా చూపించబోతున్నారు.
Also Read: రణబీర్ కపూర్ నోట RRR మాట.. అలియాతో అంత మాట అనేశాడేంటి ?