Pawan Kalyan : అడవి బాట పట్టిన పవన్ కల్యాణ్ - రానా.. షూటింగ్ ఎక్కడంటే..?

Published : Dec 17, 2021, 05:07 PM ISTUpdated : Dec 17, 2021, 05:08 PM IST
Pawan Kalyan : అడవి బాట పట్టిన పవన్ కల్యాణ్ - రానా.. షూటింగ్ ఎక్కడంటే..?

సారాంశం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రానా అడవి బాట పట్టారు. భీమ్లా నాయక్ సినిమాను త్వరగా కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే  చకచకా షెడ్యూల్ ను పూర్తి చేయడం కోసం ఫారెస్ట్ లొకేషన్ కు మకాం మార్చారు. 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రానా కాంబినేషన్ లో సాగర్ చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. మలయాళ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీని ఫాస్ట్ గా కంప్లీట్ చేడానికి రెడీ అయ్యారు టీమ్. 

 

భీమ్లా నాయక్ షూటింగ్ కోసం అడవి బాట పట్టారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ -రానా.  ఇప్పటికే షూటింగ్ లేట్ అవుతూ వస్తోంది. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతోంది. అందుకే మిగిలిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వికారాబాద్ అడవి దగ్గరల్లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. పవన్, రానా మధ్య ఇంపార్టెంట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ అంతా దాదాపు కంప్లీట్ అయిపోయినట్టే అంటున్నారు. 

Also Read: MARUTHI- PUSHPA : పుష్ప టికెట్స్ దొరకడంలేదన్న మారుతి...రాశీ ఖన్నా ఏమన్నదంటే..?

భీమ్లా నాయక్ షూటింగ్ లేట్ అవుతున్నా సరే... ప్రమోషన్స్ విషయంలో ఫాస్ట్ గానే ఆలోచిస్తున్నారు టీమ్. ఎప్పుడూ ఏదో ఒక అప్ డేట్ ను రిలీజ్ చేసి.. మూవీ పై అంచనాలు పెంచుతూనే ఉన్నరు. పవన్ - రానాకు సంబంధించి ఇప్పటికే చాలా అప్ డేట్స్ ఈమూవీ నుంచి రిలీజ్ అయ్యాయి. రీసెంట్ గా రానా భర్త్ డే సందర్బంగా డానియల్ శేఖర్ స్పెషల్ వీడియో ట్రీట్ కూడా ఇచ్చారు టీమ్. ఇక సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాల మధ్యలో పోటీ పడబోతున్న భీమ్లా నాయక్.. ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో చూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ramya Krishnan రహస్యం వెల్లడించిన రజినీకాంత్, నీలాంబరి పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?
400 సినిమాల రికార్డు, 100 కోట్లకుపైగా ఆస్తి, 3 పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?