
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ 'పుష్ప'. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ఓ ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ ఇనిస్టెంట్ గా హిట్టై కూర్చుంది. సాంగ్ రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఈ చిత్రం ఈ సాంగ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ సమంత చిందేసిన ఈ పాట కోసం మేకర్స్ దాదాపు రూ.5కోట్లు వరకు ఖర్చుపెట్టారని అన్నారు. అంతేకాదు దీనిలో సమంతకి ఇచ్చిన రెమ్యునరేషన్ రూ 1.5 కోట్లని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సాంగ్ కోసం భారీ ఖర్చు చేసి సెట్ వేశారు. ఈ నేపధ్యంలో తెరపై ఈ పాట ఎలా వచ్చింది..ఏ మేరకు ఆకట్టుకునేది చర్చనీయాంశంగా మారింది.
ఫస్టాఫ్ చివరలో వచ్చే ఈ సాంగ్ అంత కిక్కు ఇవ్వలేదనే చెప్పాలి. ఏదో హడావిడిగా ముగిసినట్లు అనిపించింది. ఈ సాంగ్ నేపధ్యం విలన్ గా కనిపించే మంగళం శీను (సునీల్) ఇస్తున్న పార్టీలో వస్తుందీ ఈ సాంగ్. ఈ సాంగ్ ఏదో రొటీన్ టిపికల్ ఐటం నెంబర్ లా సాగింది. హడావిడిగా చుట్టేసినట్లు అనిపిస్తుంది. అయితే సమంత ఇలాంటి హాట్ ఐటెం సాంగ్ మాత్రం చేయలేదని చెప్పవచ్చు. ఏ విధమైన ఇబ్బంది పడకుండా తన ఎదర భాగం, తొడలు ఎక్సపోజ్ చేసింది. తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తోంది. తమిళంలో అయితే ఈ సాంగ్ కు జనం లేచి విజిల్స్,డాన్స్ వేస్తున్నారని టాక్.
'పుష్ప' సినిమాలో సమంత స్పెషల్‌సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అదే స్థాయిలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. సమంత తొలిసారిగా చేసిన ఐటెం సాంగ్‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. పాట లిరిక్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ పాటను బ్యాన్ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇటీవలె తమిళనాడులోని పురుషుల సంఘం సైతం ఏపీలోని చిత్తూరు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
పుష్ప ప్రమోషన్లలో పాల్గొన్న అల్లు అర్జున్ ఈ కాంట్రవర్సరీపై స్పందించారు. ‘మీ మగబుద్ధే వంకరబుద్ధి..' అంటూ పాట లిరిక్స్‌పై వస్తున్న వివాదాలపై మీ స్పందన ఏంటి అని ఓ రిపోర్టర్ బన్నీని ప్రశ్నించగా... 'లిరిక్స్‌లో తప్పు లేదు, ఇదే నిజం' అంటూ షాకింగ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.