బన్నీతో చరణ్ కి చెడింది... ఇదిగో ప్రూఫ్...!

Published : Apr 08, 2023, 08:05 PM ISTUpdated : Apr 08, 2023, 08:11 PM IST
బన్నీతో చరణ్ కి చెడింది... ఇదిగో ప్రూఫ్...!

సారాంశం

మెగా-అల్లు ఫ్యామిలీస్ మధ్య విబేధాలు ఉన్నాయని ప్రచారం అవుతుంది. ఈ పుకార్లను రామ్ చరణ్ సోషల్ మీడియా బిహేవియర్ నిర్ధారిస్తుంది.   

మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే. పరిశ్రమ మొత్తం ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అల్లు అర్జున్ మాత్రం ఎలాంటి సోషల్ మీడియా పోస్ట్ పెట్టలేదు. అదే రోజు రాత్రి చిరంజీవి తన నివాసంలో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి కూడా అల్లు అర్జున్ హాజరు కాలేదు. చరణ్, అల్లు అర్జున్ మధ్య సఖ్యత లేదన్న వాదనలకు ఈ పరిణామాలు బలం చేకూర్చాయి. 

కాగా నేడు అల్లు అర్జున్ బర్త్ డే. రామ్ చరణ్ మాత్రం స్పందించారు. ట్విట్టర్ లో ఆయన్ని విష్ చేశాడు. హ్యాపియెస్ట్  బర్త్ డే అల్లు అర్జున్... అని కామెంట్ పెట్టారు. ఆ వెంటనే అక్కినేని అఖిల్ కి కూడా ఆయన బర్త్ డే విషెస్ చెప్పారు. నేడు అఖిల్ బర్త్ డే కూడా కాగా... హ్యాపీ బర్త్ డే మై డియరెస్ట్ అఖిల్ అని కామెంట్ పెట్టాడు. అఖిల్ తో దిగిన ఫోటో పోస్ట్ చేశాడు. 

అల్లు అర్జున్ మీద చరణ్ కోపంగా ఉన్నాడు. ఇద్దరి మధ్య ఇగో వార్ నడుస్తుందనడానికి ఇది క్లియర్ ఇండికేషన్ అని పలువురి వాదన. ఫ్యామిలీ మెంబర్ అల్లు అర్జున్ కి మించిన ఇంపార్టెన్స్ అఖిల్ కి చరణ్ ఇచ్చాడని ఆ ట్వీట్ ద్వారా అర్థం అవుతుంది. అల్లు అర్జున్ కి పొడిపొడిగా రెండు పదాల్లో విష్ చేసిన చరణ్ అఖిల్ ని డియరెస్ట్ అని సంబోధించారు. అలాగే ఫోటో పంచుకున్నారు. ఇలా భిన్నమైన పోస్ట్స్ రామ్ చరణ్ కావాలనే చేశారనిపిస్తుంది. తన అసహనం పరోక్షంగా బయటపెట్టారని తెలుస్తుంది. 

ఇక  రామ్ చరణ్ ట్వీట్స్  క్రింద అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫ్యాన్ వార్ షురూ అయ్యింది. ముష్టి వేశాము తీసుకోండని రామ్ చరణ్ ఫ్యాన్ కామెంట్ చేయగా, పోస్ట్ చేయడానికి ఒక్క ఫోటో కూడా దొరకలేదా చడ్డీ... అని బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే చరణ్ ట్వీట్ ఫ్యాన్ వార్ కి దారి తీసేలా ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మేకప్ పై సాయి పల్లవి ఓపెన్ కామెంట్స్, ఆ తలనొప్పి నాకు లేదంటున్న స్టార్ హీరోయిన్
NTR: షారూఖ్‌ ఖాన్‌తో ఎన్టీఆర్‌ భారీ మల్టీస్టారర్‌.. `వార్‌ 2`తో దెబ్బ పడ్డా తగ్గని యంగ్‌ టైగర్‌