అల్లు అర్జున్ కి చరణ్ బర్త్ డే విషెష్, ముష్టి వేశాం తీసుకోండి... మొదలైన మాటల యుద్ధం!

Published : Apr 08, 2023, 06:31 PM ISTUpdated : Apr 08, 2023, 06:44 PM IST
అల్లు అర్జున్ కి చరణ్ బర్త్ డే విషెష్, ముష్టి వేశాం తీసుకోండి... మొదలైన మాటల యుద్ధం!

సారాంశం

నేడు అల్లు అర్జున్ బర్త్ డే కాగా రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్వీట్ మెగా అభిమానుల మధ్య అంతర్యుద్ధానికి దారితీసింది.   

మెగా అభిమానుల మధ్య తరచుగా అంతర్యుద్ధాలు చోటు చేసుకుంటున్నాయి. ఇతర హీరోల ఫ్యాన్స్ తో కలిసి పోరాడే వీరు... పంతానికి వస్తే వారిలో వారు కూడా కుమ్ములాటకు దిగుతారు. పవన్ కళ్యాణ్-చరణ్ ఫ్యాన్స్ కి పడదు. చరణ్-అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గిట్టదు. పవన్-అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పొసగదు. వాదానికి దిగితే ఇతర హీరోల ఫ్యాన్స్ వద్ద పరువుపోతుందని కూడా ఆలోచించరు. ఆ మధ్య పవన్, చరణ్ ఫ్యాన్స్ స్పేస్ లో ఒకరిపై ఒకరు నీచమైన ఆరోపణలు చేసుకున్నారు. పవన్, చరణ్ ఇజ్జత్ తీసేసారు. 

మరో సందర్భంలో చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా పోరుకు దిగారు. ఒకరినొకరు ఉద్దేశిస్తూ దిగజారిపోయి ట్యాగ్స్ ట్రెండ్ చేశారు. బన్నీ, చరణ్ భార్యల పరువు తీస్తూ నెగిటివ్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేశారు. ఇక అల్లు అర్జున్ ని తిట్టాల్సి వస్తే... చరణ్, పవన్ ఫ్యాన్స్ ఒకటవుతారు. అల్లు అర్జున్ మెగా హీరో ట్యాగ్ వద్దనుకుంటున్నాడనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... అల్లు అర్జున్ ని చరణ్, పవన్ ఫ్యాన్స్ దూరం పెట్టారనే వాదన ఉంది. 

అభిమానుల మధ్యే కాదు చరణ్, అల్లు అర్జున్ మధ్య విభేదాలున్నాయనే ఓ వాదన ఉంది. దీనిపై ఒకటి రెండు సార్లు చిరంజీవి, అల్లు అరవింద్ స్పందించారు. దాన్ని ఖండించారు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే కాగా... అల్లు అర్జున్ విష్ చేయలేదు. నైట్ గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేయగా హాజరు కాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో పుకార్లు నిజమే అంటూ కొందరు వాదిస్తున్నారు. 

కాగా నేడు అల్లు అర్జున్ బర్త్ డే. చిరంజీవి ఉదయాన్నే విష్ చేశారు. రామ్ చరణ్ కొంచెం ఆలస్యంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. హ్యాపియెస్ట్ బర్త్ డే అల్లు అర్జున్ ని పొడిపొడిగా ఓ పదం పోస్ట్ చేశారు. ఎలాంటి ఫోటో జోడించలేదు. రామ్ చరణ్ ట్వీట్ క్రింద అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫ్యాన్ వార్ షురూ అయ్యింది. ముష్టి వేశాము తీసుకోండని రామ్ చరణ్ ఫ్యాన్ కామెంట్ చేయగా, పోస్ట్ చేయడానికి ఒక్క ఫోటో కూడా దొరకలేదా చడ్డీ... అని బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే చరణ్ ట్వీట్ ఫ్యాన్ వార్ కి దారి తీసేలా ఉంది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మేకప్ పై సాయి పల్లవి ఓపెన్ కామెంట్స్, ఆ తలనొప్పి నాకు లేదంటున్న స్టార్ హీరోయిన్
NTR: షారూఖ్‌ ఖాన్‌తో ఎన్టీఆర్‌ భారీ మల్టీస్టారర్‌.. `వార్‌ 2`తో దెబ్బ పడ్డా తగ్గని యంగ్‌ టైగర్‌