ఆ సంఘటనలు షాక్ తగిలేలా చేశాయి... ప్రీతి జింటా కామెంట్స్ వైరల్

Published : Apr 08, 2023, 06:59 PM ISTUpdated : Apr 08, 2023, 07:04 PM IST
ఆ సంఘటనలు షాక్ తగిలేలా చేశాయి... ప్రీతి జింటా కామెంట్స్ వైరల్

సారాంశం

 బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రీతి జింటా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రెండు సంఘటనలు తన జీవితంలో మర్చిపోలేను అంటుంది.  ఆ రెండు తలుచుకుంటే.. ఇప్పటికీ షాక్ లోకి వెళ్ళిపోతున్నా అంటోంది బ్యూటీ. ఇంతకీ ఏంటా సంఘటనలు.  

షారుఖ్ ఖాన్ సరసన దిల్ సే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. సొట్టబుగ్గట సుందరి ప్రీతి జింటా. హిందీతో పాటు  తెలుగులో కూడా నటించిన బ్యూటీ.. టాలీవుడ్ లో రెండే సినిమాలు చేసింది. కాని సూపర్ హిట్ సినిమాలతో మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితం అయిన బ్యూటీ.. అక్కడ కూడా సినిమాలు తగ్గించింది. వెబ్ మూవీస్ చేసుకుంటూ.. అప్పుడప్పుడు సినిమాలు చేస్తోంది. ఓటీటీ కంటెంట్ పై ఎక్కువ దృష్టి పెట్టింది బ్యూటీ.. ఈక్రమంలో రీసెంట్ గా ప్రీతి జింటా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక ఆమె రీసెంట్ గా తనకు ఎదురైన రెండు  సంఘటనలు షాకింగ్ కు గురిచేశాయి అంటుంది.  తాను తన కూతురు కలిసి ఉండా ఒక గుర్తు తెలియని మహిళ తమ దగ్గరికి వచ్చితన కూతురు తో ఓ ఫొటో తీసుకుంటానని అడిగిందట, అందుకు తాను ఒప్పుకోకపోవడంతో.. ఆమె వెంటనే అనూహ్యంగా.. తన కుమార్తెను గట్టిగా హత్తుకుని, మూతి పక్కన ముద్దుపెట్టిందని  అంటోంది ప్రీతి. దాంతో తను షాక్ కు గురయ్యానని.. తాను షాక్ లోనుంచి కోలుకునే లోపు  ఆ మహిళ పారిపోయిందని అంటోంది ప్రీతి. 

దీనితో పాటు  మరో సంఘటన తను జీవితంలో మర్చిపోలేను అంటోంది. తను తన స్నేహితులతో కలిసి కారులో ఎయిర్‌ పోర్టుకు వెళ్తుండగా.. ఒక దివ్యాంగుడు అడుక్కోవడం కోసం తన కార్ దగ్గరకు వచ్చాడని. అతను చాలా కోపంగా ప్రవర్తించాడని. వీల్‌చైర్‌లో తన కారు దగ్గరికి వచ్చి.. డబ్బు కావాలని గట్టిగా అడిగాడట అతను.  డబ్బులు లేవని చెప్పినా వినిపించుకోలేదని ప్రీతి అన్నారు. అంతే కాదు తన పక్కన్న ఉన్న స్నేహితురాలు  పర్సు నుంచి కొంత చిల్లర తీసి ఇస్తే.. అది సరిపోదని విసిరికొట్టాడని, తాను వెళ్తుంటే వీల్‌చైర్‌తో వెంబడించాడని చెప్పింది. ఆ ఘటన కూడా తనను షాక్‌కు గురిచేసిందని తెలిపింది. ఈ రెండు సంఘటనలు తాను మర్చిపోలేనంటోంది. 

ఇక ప్రీతి జింటా బాలీవుడ్ లో బిజీ అవ్వాలని చూస్తోంది. టాలీవుడ్ లో అవకాశాలు వస్తే సినిమా చేస్తానంటోంది. తెలుగులో విక్టరీ వెంకటేష్ తో.. ప్రేమంటే ఇదేరా.. మహేష్ బాబుతో రాజ కుమారుడు సినిమాల్లో నటించి.. తెలుగు ఆడియన్స్ ను మెప్పించింది. అంతే కాదు సొట్టబుగ్గలతో ప్రీతిజింటా నవ్వు.. అప్పట్లో యూత్ ను ఉడికించి.. ఉరుకులు పెట్టించింది. ఇప్పటికీ ఆమెకు హాట్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మేకప్ పై సాయి పల్లవి ఓపెన్ కామెంట్స్, ఆ తలనొప్పి నాకు లేదంటున్న స్టార్ హీరోయిన్
NTR: షారూఖ్‌ ఖాన్‌తో ఎన్టీఆర్‌ భారీ మల్టీస్టారర్‌.. `వార్‌ 2`తో దెబ్బ పడ్డా తగ్గని యంగ్‌ టైగర్‌