శంకర్ చిత్రాల్లో కనిపించే భారీదనంతో పాటు, రామ్‌చరణ్ నుంచి అభిమానులు కోరుకునే మాస్ అంశాలు పుష్కలంగా ఈ సినిమాలో ఉంటాయట. ఇప్పటివరకూ రామ్‌చరణ్ చేయని సరికొత్త పాత్రలో శంకర్ చెర్రీని చూపించనున్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో తారాగణం కూడా భారీగానే ఉండనుంది.
రామ్‌చరణ్‌తో శంకర్ చేయనున్న ఈ ప్యాన్ ఇండియా సినిమాని భారీగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇది ఖచ్చితంగా క్రేజీ కాంబో . ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ సినిమా చిత్రం మీదే అందరి దృష్టీ ఉంది. రకరకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించిన ఓ వార్త చెర్రీ ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. అదేమిటంటే...
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రామ్ చరణ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. ఇందుకోసం రామ్ చరణ్ ప్రత్యకమైన మేకప్ తో కనపడనున్నారు. ఆ పాత్రలు రెండు తండ్రి, కొడుకు అని తెలుస్తోంది. తండ్రి పాత్ర కోసం ప్రత్యకమైన లుక్ ని డిజైన్ చేసారని, అసలు చరణ్ ని అలా ఊహించలేమని అంటున్నారు. భారతీయుడులో కమల్ టైప్ లో ఈ డబుల్ పాత్రలు రెండూ తెరపై అల్లాడిస్తాయట. అయితే ఇది నిజమా ..రూమరా అని తెలియాల్సి ఉంది.
ఇక శంకర్ అంటే భారీతనానికి పెట్టింది పేరు. అదే సమయంలో చరణ్‌కు మాస్‌లో మంచి ఇమేజ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని శంకర్ కథను సిద్ధం చేసిన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పొలిటికల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుందని ఓ టాక్. గతంలో ‘ఒకే ఒక్కడు’ తరహాలో ఇందులో చరణ్ పాత్ర ఉంటుందని గుసగుసలు వినిపించాయి. ఐఏఎస్ అధికారి సీఎం అయితే, సమాజంలో ఎలాంటి మార్పు తెచ్చాడన్న ఇతివృత్తంతో కథ సాగుతుందని చెప్తన్నారు. అంతేకాదండోయ్, ఈ మెగా హీరోను.. ఈ మెగా డైరెక్టర్ ఎలాగో అదిరిపోయేలా చూపిస్తారు.
Also read ఎన్టీఆర్ ఔదార్యం.. చావుబతుకుల్లో ఉన్న అభిమానికి భరోసా!
కాబట్టి ఆ విషయం ప్రక్కన పెడితే ఈ సినిమాకు బడ్జెట్ గా 170 కోట్లు పెడుతున్నారనేది వార్త. అంత పెట్టడం భారీ రిస్కే అంటున్నారు. అందుకు కారణం శంకర్ వరసగా చేసిన సినిమాలు విజయ్ తో నంబన్(స్నేహితుడు), విక్రమ్ ఐ, రజనీతో చేసిన 2.0 ఈ మూడు చిత్రాలు రిలీజ్ కు ముందు భారీగా బజ్ క్రియేట్ చేసాయి. కానీ ఆ స్దాయిలో వర్కవుట్ కాలేదు. రోబో సీక్వెల్ 2.0 ని దిల్ రాజు రిలీజ్ చేసారు కానీ కమర్షియల్ గా ఫెయిల్యూర్ అనేది అప్పట్లో తేలింది. ఈ నేపధ్యంలో 170 కోట్లు రికవరీ అనేది మామూలు విషయం కాదు. అయితే ఎంతో అనుభవం ఉన్న నిర్మాత దిల్ రాజు కు లెక్కలు వేరేగా ఉంటాయి. ఆయన ప్రతీ పైసా తెరపై కనపడేలా చూస్తారు. అలాగే బిజినెస్ విషయంలోనూ దిల్ రాజు లెక్కలే వేరు. అదే వర్కవుట్ అవుతుందంటున్నారు.
Also read అల్లు అర్జున్ కు నచ్చ చెప్పచ్చని చిరు ఆ డెసిషన్ తీసుకున్నారా?
చరణ్ - శంకర్ కలయిక, పాన్ ఇండియా స్థాయి సినిమాగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. శంకర్ చిత్రాల్లో కనిపించే భారీదనంతో పాటు, రామ్‌చరణ్ నుంచి అభిమానులు కోరుకునే మాస్ అంశాలు పుష్కలంగా ఈ సినిమాలో ఉంటాయట. ఇప్పటివరకూ రామ్‌చరణ్ చేయని సరికొత్త పాత్రలో శంకర్ చెర్రీని చూపించనున్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో తారాగణం కూడా భారీగానే ఉండనుంది. ఇది మాకొక మైలురాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై 50వ చిత్రంగా ఇంతకు ముందెప్పుడూ చూడని రెండు బలమైన శక్తులను కలిపి తెరపై చూపించబోతున్నాం. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఇండియన్ సినిమా షో మెన్ శంకర్‌లతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది అంటున్నారు దిల్ రాజు.