డ్రగ్స్ కేసు... షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కి మద్దతుగా నిలిచిన హృతిక్ రోషన్

By team telugu  |  First Published Oct 7, 2021, 3:26 PM IST

స్టార్ హీరో హృతిక్ రోషన్ ఆర్యన్ ఖాన్ కి మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్ చేస్తారు. Hrithik roshan ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ సుదీర్ఘ సందేశం పంచుకోవడం జరిగింది. 
 



డ్రగ్స్ ఆరోపణలపై అరెస్ట్ కాబడిన ఆర్యన్ ఖాన్ కి బాలీవుడ్ ప్రముఖుల నుండి మద్దతు లభిస్తుంది. ఇప్పటికే పలువురు సెలెబ్స్ బహిరంగంగా ఆర్యన్ ఖాన్ నిర్దోషి అంటూ ప్రకటించారు. తాజాగా స్టార్ హీరో హృతిక్ రోషన్ ఆర్యన్ ఖాన్ కి మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్ చేస్తారు. Hrithik roshan ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ సుదీర్ఘ సందేశం పంచుకోవడం జరిగింది. 


జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను స్వీకరించు, జరుగుతున్న పరిణామాలు గమనించు. తరువాత సందేహాలకు సంబంధించిన సవాళ్ళను కలుపుకుంటే నీకు అసలు విషయం అవగతం అవుతుంది. నీవు నాకు బాలుడిగా తెలుసు, యువకుడిగా తెలుసు... ఊహకు అందనిదే జీవితం, దేవుడు దయగలవాడు, సమర్థులకే పరీక్షలు పెడతారు. జీవితంలో అపజయాలు, విజయాలు, మంచి, చెడులు అన్నీ ఉంటాయి... అంటూ హృతిక్ తన సందేశంలో ఆర్యన్ లో మనో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. 

Latest Videos

Also read ఆ స్టార్ హీరోల భార్యలు డ్రగ్స్ తీసుకుంటారు.. స్వయంగా చూసి షాకయ్యా


ఇక శనివారం ముంబై అరేబియా సముద్రంలో క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీ నిర్వహించారన్న ఆరోపణలపై సోమవారం ఆర్యన్ ఖాన్ తో పాటు 7గురిని అరెస్ట్ చేశారు. గత నాలుగు రోజులుగా ఎన్సీబీ అధికారుల కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్, విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో షారూ‌ఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను కోర్టులో హాజరుపర్చారు ఎన్సీబీ అధికారులు.  అయితే ఆర్యన్ ఖాన్ కు బెయిల్ కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. 

ఆర్యన్ ఖాన్ ఫోన్ లో కీలకమైన సమాచారం ఉందని ఎన్సీబీ అధికారులు కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. ఆర్యన్ నుండి కొకైన్ కూడ సీజ్ చేసినట్టుగా కోర్టుకు తెలిపింది కోర్టు.ఆర్యన్ ఖాన్ నుండి డ్రగ్స్ కు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని సేకరించేందుకు ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఎన్సీబీ అధికారులు కోరారు. ఎన్సీబీ అధికారుల వినతికి కోర్టు అంగీకరించింది. ఈ నెల 7వ తేదీ వరకు ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ కస్టడీకి కోర్టు అనుమతిని ఇచ్చింది.
 

click me!