రామ్‌చరణ్‌ హీరోయిన్‌కి కరోనా.. హోం క్వారంటైన్‌లో..

Published : Jan 09, 2022, 07:57 PM IST
రామ్‌చరణ్‌ హీరోయిన్‌కి కరోనా.. హోం క్వారంటైన్‌లో..

సారాంశం

బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇషా గుప్తాకి కరోనా సోకింది. కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఇషా గుప్తా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది.

కరోనా థర్డ్ వేవ్‌ విలయతాండవం ప్రారంభమైంది. అత్యంత వేగంగా ఈ వైరస్‌ దూసుకొస్తుంది. తాజాగా మరో సెలబ్రిటీ కరోనా బారిన పడ్డారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇషా గుప్తాకి కరోనా సోకింది. కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఇషా గుప్తా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. `అత్యంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా సోకింది. నేను ఐసోలేట్‌ అయి నిబంధనలు పాటిస్తున్నాను. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నా. దీన్నుంచి మరింత బలంగా తయారై తిరిగి వస్తాను. అందరు సురక్షితంగా ఉండండి. మాస్క్ ధరించండి. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి` అని ఇన్‌స్టా స్టోరీస్‌లో పేర్కొంది ఇషా గుప్తా. 

ఇప్పటికే చాలా మంది బాలీవుడ్‌ తారలు కరోనా బారిన పడ్డారు. బోనీ కపూర్‌, ఏక్తా కపూర్‌, జాన్‌ అబ్రహం, ఆయన భార్య ప్రియా రుంచల్‌, విశాల్‌ డడ్లానీ,స్వర భాస్కర్‌, మృణాల్‌ ఠాకూర్‌, అర్జున్‌ కపూర్‌, ప్రేమ్‌ చోప్రా వంటి వారు కరోనా సోకి ఒంటరి జీవితాలను అనుభవిస్తున్నారు. మరోవైపు తెలుగు, తమిళంలోనూ వరుసగా సెలబ్రిటీలు కరోనాకి గురవుతున్నారు. టాలీవుడ్‌లో మహేష్‌బాబు, రాజేంద్రప్రసాద్‌, మంచు మనోజ్‌ కరోనా బారిన పడ్డారు. అలాగే తమిళనాటు విష్ణు విశాల్‌,  త్రిష, అరుణ్‌ విజయ్‌, వడివేలు, మీనా, సత్యరాజ్‌, దర్శకుడు ప్రియదర్శన్‌ కరోనా బారిన పడ్డారు. 

ఇక ఇషా గుప్తా.. `జన్నత్‌2` చిత్రంతో నటిగా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతో గ్లామర్‌ నటిగా మెప్పించింది. ఆ తర్వాత `రాజ్‌3డీ` సినిమాతో అందాల ఆరబోతతో బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. `చక్రవ్యూహ`, `గోరి తేరి ప్యార్‌ మెయిన్‌`, `హమ్‌షకల్స్`, `రుస్తూమ్‌`, `కమాండో 2`, `బాద్షా` వంటి సినిమాలతో బాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపుని స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. 

ఈ క్రమంలో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. `వీడెవడు` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించింది. సచిన్‌ జోషి ఈ చిత్రంలో హీరోగా నటించారు. మరోవైపు రామ్‌చరణ్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన `వినయ విధేయరామ` చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. `ఏక్‌ బార్‌ ఏక్‌ బార్‌` పాటలో తన అందచందాలతో ఉర్రూతలూగించింది. సినిమా సక్సెస్‌ కాలేకపోవడంతో అంతగా పేరు రాలేదు. ప్రస్తుతం ఆమె `హేరా పేరి 3` చిత్రంలో నటించింది. ఇది విడుదల కావాల్సి ఉంది. గతేడాది `నకాబ్‌` అనే వెబ్‌ సిరీస్‌లోనూ మెరిసింది ఇషా గుప్తా. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Balakrishna: బాలకృష్ణకి నచ్చిన జూ. ఎన్టీఆర్ 2 సినిమాలు ఏంటో తెలుసా ? అభిమానులకు పూనకాలు తెప్పించిన మాట అదే
Chiranjeevi : దాసరి స్థానం మెగాస్టార్ దే, ఇండస్ట్రీ పెద్ద ఎవరో తేల్చేసిన మా మాజీ అధ్యక్షుడు