పవన్ కళ్యాణ్ ని కలవమని చెప్పిన అజిత్.. ఎప్పుడు, ఎందుకు ?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 09, 2022, 07:42 PM IST
పవన్ కళ్యాణ్ ని కలవమని చెప్పిన అజిత్.. ఎప్పుడు, ఎందుకు ?

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తలా అజిత్ లకు కామన్ గా తెలుగు తమిళ భాషల్లో అభిమానులు ఉన్నారు. ఇద్దరిది విభిన్నమైన శైలి అయినప్పటికీ ప్రత్యేకంగా ఉంటుంది. మిగిలిన ఏ హీరోలతో వీరిద్దరి నటన, యాటిట్యూడ్ కి పోలికలు ఉండవు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తలా అజిత్ లకు కామన్ గా తెలుగు తమిళ భాషల్లో అభిమానులు ఉన్నారు. ఇద్దరిది విభిన్నమైన శైలి అయినప్పటికీ ప్రత్యేకంగా ఉంటుంది. మిగిలిన ఏ హీరోలతో వీరిద్దరి నటన, యాటిట్యూడ్ కి పోలికలు ఉండవు. అందుకే పవన్, అజిత్ లని ప్రత్యేకంగా అభిమానించే ఫ్యాన్స్ ఉన్నారు. 

పవన్ కళ్యాణ్ కెరీర్ లో తమ్ముడు ప్రత్యేకమైన చిత్రం. యువతకి పవన్ ని మరింత చేరువ చేసిన చిత్రం అది. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. తమ్ముడు చిత్రానికి పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ విషయాన్ని అరుణ్ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

తాను చెన్నైలో ఉన్నప్పుడు బాగా కోలీవుడ్ లో బాగా సర్కిల్ ఉండేది. దీనితో తమ్ముడు చిత్రాన్ని అజిత్ తో తెరకెక్కించాలని అనుకున్నా. అజిత్ ని కలసి కథ వినిపించా. కానీ అజిత్ మాత్రం వెళ్లి పవన్ కళ్యాణ్ ని అప్రోచ్ కండి అని సలహా ఇచ్చారు. అజిత్ ఆ మాట చెప్పడంతో పవన్ గత చిత్రాలు చూశా. దీనితో తమ్ముడు కథని పవన్ తోనే చేయాలని డిసైడ్ అయినట్లు అరుణ్ ప్రసాద్ అన్నారు. 

అలా అజిత్ చేయాల్సిన తమ్ముడు చిత్రం పవన్ ఖాతాలో పడింది. యాదృచ్చికమో ఏమో కానీ అజిత్ వీరమ్ చిత్రాన్ని పవన్ తెలుగులో కాటమరాయుడుగా రీమేక్ చేశారు. ఇక పింక్ రీమేక్ లో తెలుగులో పవన్ నటించగా తమిళ్ లో అజిత్ నటించాడు. 

పవన్ నటించిన భీమ్లా నాయక్, అజిత్ నటించిన వాలిమై చిత్రాలు సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ రెండు చిత్రాలు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడ్డాయి. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Balakrishna: బాలకృష్ణకి నచ్చిన జూ. ఎన్టీఆర్ 2 సినిమాలు ఏంటో తెలుసా ? అభిమానులకు పూనకాలు తెప్పించిన మాట అదే
Chiranjeevi : దాసరి స్థానం మెగాస్టార్ దే, ఇండస్ట్రీ పెద్ద ఎవరో తేల్చేసిన మా మాజీ అధ్యక్షుడు